Homeతెలంగాణఉచిత పాఠ్య‌పుస్త‌కాల‌ను విద్యార్థులు స‌ద్వినియోగం చేసుకోవాలి...!

ఉచిత పాఠ్య‌పుస్త‌కాల‌ను విద్యార్థులు స‌ద్వినియోగం చేసుకోవాలి…!

  • ప‌దిలో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన విద్యార్థుల‌కు న‌గ‌దు పుర‌స్కారాలు

 

మంచిర్యాల, క్రైమ్ మిర్ర‌ర్‌: మంచిర్యాల జిల్లా కోట‌ప‌ల్లి మండ‌లంలోని దేవుల‌వాడ‌ పీఎంశ్రీ జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో పాఠ్య‌పుస్త‌కాల‌ను బ‌బ్బెర‌చెల్క గ్రామ స‌ర్పంచ్ విద్యార్థుల‌కు అంద‌జేశారు. సోమ‌వారం పాఠ‌శాల ప్ర‌ధానోపాద్యాయులు స‌యింపు శ్రీ‌నివాస‌రావు ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి గ్రామ స‌ర్పంచ్ ప్ర‌దీప్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ప్ర‌భుత్వం కోట్లాది రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేసి అంద‌జేస్తున్న పాఠ్య పుస్త‌కాల‌ను విద్యార్థులు స‌క్ర‌మంగా వినియోగించుకోవాల‌న్నారు. విద్యార్థులు క‌ష్ట‌ప‌డి చ‌దివితేనే ఉత్త‌మ ప‌లితాలు సాధిస్తార‌ని తెలిపారు.

Also Read:సారూ..నన్ను నా కొడుకు నుంచి రక్షించండి…! వృద్దురాలి క‌న్నీటి విన‌తి…..

అనంత‌రం 2026 మార్చిలో ప‌దిలో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన విద్యార్థుల‌కు ప్ర‌ధానోపాద్యాయుల తల్లిదండ్రులైన రామ‌చంద్ర‌య్య‌, రాఘ‌వ‌మ్మ జ్ఞాప‌కార్థం చెన్నూరి అశ్విత్‌(513) మార్కులు సాధించినందుకు గాను రూ. 5వేలు, అల్సా మౌనిక (497) మార్కుల‌కు గాను 3వేలు, కుందార‌పు నంద‌కిషోర్ (495), అశ్విత‌(493)మార్కులు సాధించినందుకు చెరో రూ.2వేల‌ను స‌ర్పంచ్ ప్ర‌దీప్ రెడ్డి, ఉప స‌ర్పంచ్ రాజ‌న్న‌, వార్డు స‌భ్యులు ప్ర‌కాశ్ రెడ్డి, ఏఏపీసీ చైర్మ‌న్ తూము సువ‌ర్ణ చేతుల మీదుగా అంద‌జేసి సన్మానించారు. అదే విధంగా ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన ముగ్గురు విద్యార్థుల‌కు రూ. ప‌దివేల‌ను బ‌హుక‌రించిన‌ట్లుగా ప్ర‌ధానోపాద్యాయులు తెలిపారు.ఈ కార్య‌క్ర‌మంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Also Read:స్టాన్‌ఫోర్డ్ వేదికగా సుందర్ పిచాయ్‌కు విద్యార్థుల నిరసన – గూగుల్ ఒప్పందాలపై ఆగ్రహం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు