క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- ఏలూరు జిల్లా వేలేరుపాడు లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఒక ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళలు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనతో వేలేరుపాడులో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక ఇంటి వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం వల్ల రెండు ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి సమయం కావడంతో అప్పటికే ఆ రెండు ఇళ్లలో నిద్రిస్తున్న ఇద్దరు మహిళలు ఈ ప్రమాదంలో చిక్కుకుపోయారు. మంటలు వ్యాప్తి చెందిన విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ఇళ్లకు చెందిన ఎంతోమంది వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే మంటలు భారీగా చాలా రేగడంతో అదుపులోకి రాలేదు. అయితే అప్పటికే ఇంటిలో నిద్రిస్తున్న ఇద్దరు మహిళలు ఈ ప్రమాద ఘటనలో చిక్కుకుపోయి మృతి చెందారు. మంటలు పూర్తిగా వ్యాప్తి చెందడంతో ఇళ్లలో ఉన్న ఇద్దరు మహిళలు బయటకు రాలేకపోవడంతో దహనమైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాద ఘటనలో మృతి చెందిన మహిళల్లో వలగాని సావిత్రి (60), పూలమ్మ (65) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనలో మృతి చెందిన పూలమ్మ తెలంగాణలోని సూర్యాపేట నుంచి రెండు రోజుల కిందటే వేలేరుపాడులోని తన చెల్లిని చూసేందుకు వచ్చింది. మరో రెండు రోజుల్లో స్వగ్రామానికి వెళ్లిపోతుందనుకున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటన సమయంలో ఇద్దరు మహిళలు ఇంట్లో ఉన్నారు. మంటలు ఒక్కసారిగా వ్యాప్తి చెందడంతో వారు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే వారు మంటల్లో చిక్కుకొని సజీవ దహనం అయినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి గురైన రెండు ఇల్లు పూర్తిగా బూడిద అయ్యాయి. అర్ధరాత్రి సమయంలో మంటలు వ్యాప్తి చెందడంతో ఎవరికీ తెలియలేదని స్థానికులు చెబుతున్నారు. భారీగా మంటలు వ్యాప్తి చెందిన తర్వాత అదుపు చేసేందుకు స్థానికులు ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు ఇద్దరు మహిళలు మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్ళముందే మంటల్లో చిక్కుకొని మహిళలు మృతి చెందడం పట్ల స్థానికులు కన్నీరు, మున్నీరుగా విలపించారు. భారీగా మంటలు వ్యాప్తి చెందడంతో తాము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయామని పలువురు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యులకు సంబంధించిన సమాచారం తెలుసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మంటలు వ్యాప్తి చెందిన సమయంలో వీరిద్దరూ మినహా ఎవరో ఇంట్లో లేరు.