Homeజాతీయంపురుషుల్లో ఈ లక్షణాలే మహిళలకు ఇష్టమట.. డేటింగ్ కోచ్ జేమీ!

పురుషుల్లో ఈ లక్షణాలే మహిళలకు ఇష్టమట.. డేటింగ్ కోచ్ జేమీ!

క్రైమ్ మిర్రర్,జాతీయం:- మహిళలు పురుషుల్లో ప్రధానంగా ఏ లక్షణాలను చూసి ఆకర్షితులవుతారు? అందం, ఆస్తి, లేదా ప్రభుత్వ ఉద్యోగమా? అంటే కాదనే చెబుతున్నారు ప్రముఖ డేటింగ్ కోచ్ జేమీ. ఈ విషయాలపై ఆయన స్పందిస్తూ, పురుషుల్లో మహిళలు ప్రధానంగా ఇష్టపడే మూడు ముఖ్యమైన లక్షణాలను వివరించారు.జేమీ తెలిపిన వివరాల ప్రకారం, మహిళలు ఈ క్రింది లక్షణాలున్న పురుషులను ఎక్కువగా ఇష్టపడతారు:

అహం లేని ఆత్మవిశ్వాసం:- తమపై తాము నమ్మకం ఉంటూనే, ఎదుటి వారిని గౌరవించే, అహంకారం లేని పురుషులను మహిళలు ఇష్టపడతారు.

సెన్స్ ఆఫ్ హ్యూమర్:- సరదాగా ఉంటూ, సందర్భోచితంగా నవ్వించగలిగే పురుషులు మహిళలను ఇట్టే ఆకర్షిస్తారు.

జీవిత లక్ష్యం:- జీవితంలో స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగే, నిశ్శబ్దంగా తమ పనులు చేసుకుంటూ పోయే వారిని మహిళలు అమితంగా ఇష్టపడతారు.అరిచి గోల చేయకుండా, తమ భావాలను నిశ్శబ్దంగా మరియు స్పష్టంగా వ్యక్తపరిచే వారు, తీయని మాటలతో నవ్వించగలిగే వారు, ఒక ఆశయంతో ముందుకు సాగేవారు మహిళలకు బాగా నచ్చుతారని జేమీ వివరించారు.

జగన్ కు సర్వే షాక్!

పాఠశాల బాలికపై లైంగిక దాడి ఆరోపణలు.. వృద్ధుడిపై పోక్సో కేసు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు