Homeసినిమామా ఇంటి బంగారం ఓటీటీలోకి.. స్పెషాలిటీ ఏమిటంటే!

మా ఇంటి బంగారం ఓటీటీలోకి.. స్పెషాలిటీ ఏమిటంటే!

క్రైమ్ మిర్రర్, సినిమా :- టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన యాక్షన్ ఫ్యామిలీ డ్రామా మా ఇంటి బంగారం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో భారీ విజయాన్ని నమోదు చేసి రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం తాజాగా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించింది.జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కేవలం 28 రోజుల వ్యవధిలోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి రావడం విశేషం. మహిళా ప్రధాన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో మంచి ఆదరణ పొందడంతో పాటు, ఇప్పుడు ఓటీటీలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రానికి రాజ్ నిడిమోరు స్క్రీన్‌ప్లే అందించారు. భావోద్వేగాలు, యాక్షన్, ఫ్యామిలీ డ్రామాను సమపాళ్లలో మేళవించిన ఈ సినిమా మహిళా ప్రధాన చిత్రాల్లో మరో విజయవంతమైన చిత్రంగా నిలిచింది.

మైనర్ బాలికపై లైంగిక దాడి.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు

ఈ సినిమాలో సమంత స్వర్ణ పాత్రలో నటించారు. పెళ్లి తర్వాత భర్త ఇంటికి వెళ్లిన యువతి, కొత్త కుటుంబంలో కలిసిపోవడానికి ప్రయత్నించే సమయంలో ఊహించని సంఘటనలు ఎదుర్కొంటుంది. గతానికి సంబంధించిన ఒక రహస్యం బయటపడడంతో ఆమె జీవితం మారిపోతుంది. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఆమె చేసే పోరాటమే కథకు ప్రధాన బలం.సమంత నటనతో పాటు యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ చిత్రాన్ని ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డి దువ్వురు సంయుక్తంగా నిర్మించారు. నటిగానే కాకుండా నిర్మాతగా కూడా సమంత మరో విజయాన్ని అందుకున్నారు.సినిమాలో గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, శ్రీముఖి, మంజూష ముళ్లపూడి, గౌతమి కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ప్రస్తుతం మా ఇంటి బంగారం జియో హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.

ప్రేమ పేరుతో వేధింపులు..బస్సు ఎక్కిన యువతిని వెంటాడి దాడి

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు