Homeక్రైమ్కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక మలుపు.. కుమార్తెపై తండ్రి సంచలన వ్యాఖ్యలు

కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక మలుపు.. కుమార్తెపై తండ్రి సంచలన వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న సియా గోయల్ తండ్రి ప్రవీణ్ గోయల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి.

తన కుమార్తె నిజంగా నేరానికి పాల్పడినట్లు కోర్టులో రుజువైతే చట్టపరంగా ఎలాంటి శిక్ష విధించినా అభ్యంతరం లేదని ప్రవీణ్ తెలిపారు. అయితే ఈ ఘటన కారణంగా తమ కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురవుతోందని, తమను టార్గెట్ చేయడం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే తమ కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉందని, జరిగిన పరిణామాలతో మానసికంగా కుంగిపోయామని ఆయన పేర్కొన్నారు. నిజానిజాలు దర్యాప్తులో బయటకు రావాలని కోరారు.

కాగా.. సియా గోయల్ తన ప్రియుడు చేతన్‌తో కలిసి కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరిద్దరూ కలిసి కేతన్‌ను లోయలోకి తోసి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

also read: పాఠశాల బాలికపై లైంగిక దాడి ఆరోపణలు.. వృద్ధుడిపై పోక్సో కేసు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు