Homeఆంధ్ర ప్రదేశ్ఆళ్లగడ్డలో దారుణం.. కాలువలో పసికందు మృతదేహం కలకలం

ఆళ్లగడ్డలో దారుణం.. కాలువలో పసికందు మృతదేహం కలకలం

ఆళ్లగడ్డలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పరిధిలోని కాసింతల బ్రిడ్జి సమీపంలోని కాలువలో అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది.

స్థానికుల కథనం ప్రకారం.. బ్రిడ్జి కింద ప్రవహిస్తున్న నీటిలో శిశువు మృతదేహాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తులు శిశువును కాలువలో వదిలి వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శిశువును ఎవరు వదిలివెళ్లారు? ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏంటి? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

also read: భారత్‌లో “నమో గ్రీన్” రైల్ విప్లవం.. తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు