Homeతెలంగాణసరూర్ నగర్ సంగ్రామం!

సరూర్ నగర్ సంగ్రామం!

•యువ సంగ్రామ సభకు గులాబీ పార్టీ సిద్ధం
•అనుమతుల్లో ఎడతెగని జాప్యం
•కోర్టుకు బిఆర్ఎస్ లీగల్ టీం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :- 

తెలంగాణలో గులాబీ పార్టీ స్పీడ్ పెంచుతోంది. సరూర్ నగర్ స్టేడియం వేదికగా కేటీఆర్ యువ సంగ్రామ సభకు భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 18న తలపెట్టిన ఈ సభకు పోలీసులు, అధికార యంత్రాంగం ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తుందని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. అందుకే ఈ సభ నిర్వహణకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ సాధించేందుకు తక్షణమే హైకోర్టును ఆశ్రయించేందుకు గులాబీ పార్టీ లీగల్ టీం సిద్ధమైంది. దీంతో శనివారం నాటి సభ చుట్టు హైదరాబాద్ పొలిటికల్ సర్కిల్స్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

బలమైన సెంటిమెంట్..
తెలంగాణ రాజకీయాల్లో సరూర్నగర్ స్టేడియం వేదిక అనేది ఒక బలమైన సెంటిమెంట్. 2023 అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ప్రచార పర్వం కూడా అదే లెవెల్ లో ఉండేది. అప్పట్లో ఇదే గ్రౌండ్లో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా సమక్షంలో.. ప్రతిపక్ష కాంగ్రెస్ యువ డిక్లరేషన్ ప్రకటించింది. నిరుద్యోగ భృతి,, మెగా డీఎస్సీ, ఉద్యోగాల భర్తీ వంటి ఆకర్షణీయమైన వాగ్దానాలతో నాడు కాంగ్రెస్ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అధికార పీఠాన్ని దక్కించుకుంది. ఇప్పుడు సరిగ్గా అదే వేదికను ఎంచుకొని కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తిప్పి కొట్టాలని కేటీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

ఉద్యమ సమయంలో సైతం..
తెలంగాణ ఉద్యమ దశలో సైతం పోరాటాల పురిటిగడ్డగా సరూర్ నగర్ కు మంచి పేరు ఉంది. అప్పట్లో విద్యార్థులతో పాటు యువజన పోరాటాలకు వేదికగా నిలిచింది. అటువంటి కేంద్రాన్ని ఇప్పుడు పోరాటానికి ఎంచుకున్నారు కేటీఆర్. రేవంత్ ప్రభుత్వం గద్దెనెక్కిన కాలంలో నిరుద్యోగులకు, యువతకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ.. వాటిని అమలు చేయకపోవడానికి ప్రస్తావిస్తూ కేటీఆర్ విమర్శల పర్వానికి దిగనున్నారు. దీనికి సరైన వేదిక సరూర్నగర్ గ్రౌండ్ అవుతుందని ఒక నిర్ణయానికి వచ్చారు. నాడు ప్రియాంక గాంధీ సభకు లేని అభ్యంతరాలు, నిబంధనలను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెరపైకి తేవడం కూడా చర్చకు దారితీస్తోంది. సభకు అనుమతి ఇవ్వకపోవడం పై గులాబీ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. సభ పై కాంగ్రెస్ పార్టీ భయపడుతోందన్న టాక్ వినిపిస్తోంది.

గులాబీ పార్టీ ఆగ్రహం..
అయితే ఈ సభకు అనుమతి నిరాకరించడం పై గులాబీ పార్టీ ఆగ్రహంతో ఉంది. ఎక్కడ సభ సక్సెస్ అవుతుందో నన్న భయం కాంగ్రెస్ పార్టీలో ఉందని గులాబీ పార్టీ నేతలు చేస్తున్నారు. ఈ యువ సంగ్రామ సభ ద్వారా అటు నిరుద్యోగ జెండాను ఎత్తుకుంటూనే.. అటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తమ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని కేటీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. కోర్టు అనుమతితోనైనా సభను నిర్వహించి.. రేవంత్ సర్కార్ వైఫల్యాలపై చార్జ్ షీట్ విడుదల చేయడమే లక్ష్యంగా గులాబీ దళం వ్యూహాలు రక్షిస్తోంది. సరూర్నగర్ వేదికగా శనివారం జరగబోయే ఈ పొలిటికల్ హైడ్రామా.. మరింత ఫతాక స్థాయికి చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు