Homeక్రైమ్మైనర్ బాలికపై లైంగిక దాడి.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు

మైనర్ బాలికపై లైంగిక దాడి.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు

క్రైం మిర్రర్ :  నల్గొండ జిల్లా హాలియా మండలంలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను సేకరిస్తూ అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హాలియా మండలంలోని కుపాష్‌పల్లి గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికపై గత కొన్ని నెలలుగా ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనలో కుపాష్‌పల్లి గ్రామానికి చెందిన ఆది మల్ల అజయ్, గుడిపల్లి గ్రామానికి చెందిన బండారు అఖిల్ పేర్లను పేర్కొన్నట్లు సమాచారం.

కొద్ది రోజులుగా బాలికకు కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్య పరీక్షల సందర్భంగా జరిగిన విషయాన్ని ఆమె వెల్లడించినట్లు తెలిసింది. అనంతరం బంధువులు హాలియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు బాధితురాలిని నల్గొండలోని భరోసా సెంటర్‌కు తరలించి అవసరమైన వైద్య పరీక్షలు, శాస్త్రీయ ఆధారాల సేకరణ చేపట్టినట్లు హాలియా ఎస్సై బండి సాయి ప్రశాంత్ తెలిపారు. కేసులో సంబంధిత వ్యక్తుల పాత్ర, ఇతర పరిస్థితులపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
also read : విషాదం.. ఇద్దరు పిల్లలను సంపులో తోసి తల్లి ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు