Homeలైఫ్ స్టైల్ఒత్తిడికి బ్రేక్ వేయాలా... రిషికేశ్ నుంచి కూర్గ్ వరకు భారత్‌లోని 7 బెస్ట్ వెల్‌నెస్ ట్రిప్స్...

ఒత్తిడికి బ్రేక్ వేయాలా… రిషికేశ్ నుంచి కూర్గ్ వరకు భారత్‌లోని 7 బెస్ట్ వెల్‌నెస్ ట్రిప్స్ ఇవే…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: రోజువారీ పరుగులు, పని ఒత్తిడి, బిజీ లైఫ్‌స్టైల్ మధ్య కొంత రిలాక్స్ కావాలని అనిపించడం సహజం. అలాంటి సమయంలో వెల్‌నెస్ ట్రావెల్ మంచి ఎంపికగా మారుతోంది. ప్రకృతి మధ్యలో ప్రశాంతంగా గడుపుతూ శరీరానికి, మనసుకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే ప్రదేశాలు భారత్‌లో ఎన్నో ఉన్నాయి. యోగా, ధ్యానం, ఆయుర్వేదం, నేచురల్ థెరపీలతో ఆకట్టుకునే 7 బెస్ట్ వెల్‌నెస్ డెస్టినేషన్స్ ఇవే.

రిషికేశ్…

గంగా నది ఒడ్డున, హిమాలయాల నడుమ ఉన్న రిషికేశ్ ప్రపంచవ్యాప్తంగా యోగా క్యాపిటల్‌గా గుర్తింపు పొందింది. ప్రశాంతమైన ఆశ్రమాలు, ఉదయాన్నే యోగా, ధ్యానం చేసే అవకాశం ఇక్కడ ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.

కేరళ …

కేరళలో ఆయుర్వేద చికిత్సలకు ప్రత్యేక స్థానం ఉంది. హెర్బల్ ఆయిల్ మసాజ్‌లు, డిటాక్స్ ప్రోగ్రామ్స్, హెల్తీ ఫుడ్, బ్యాక్‌వాటర్స్ అందాలు కలిసి శరీరానికి పూర్తి విశ్రాంతిని ఇస్తాయి.

గోవా…

గోవా ఇప్పుడు బీచ్‌లకే కాదు వెల్‌నెస్ రిట్రీట్స్‌కి కూడా ఫేమస్. యోగా, మెడిటేషన్, డిటాక్స్ ప్రోగ్రామ్స్‌తో పాటు సముద్ర గాలి మధ్య ప్రశాంతంగా గడపొచ్చు.

ధర్మశాల…

టిబెటన్ బౌద్ధ సంస్కృతి, చల్లని వాతావరణంతో ధర్మశాల ప్రత్యేకంగా నిలుస్తుంది. మెడిటేషన్ సెంటర్స్, ప్రశాంతమైన ట్రెక్కింగ్ ట్రైల్స్ మనసుకు ఎంతో హాయినిస్తాయి.

మైసూర్…

అష్టాంగ యోగా కోసం ప్రపంచవ్యాప్తంగా మైసూర్‌కు మంచి పేరు ఉంది. క్రమబద్ధమైన యోగా సాధన, ప్రశాంతమైన జీవనశైలి ఇక్కడి ప్రత్యేకత.

పుదుచ్చేరి…

బీచ్‌లు, ఫ్రెంచ్ స్టైల్ వీధులు, ఆరోవిల్ కమ్యూనిటీతో పుదుచ్చేరి ప్రశాంతమైన అనుభూతిని ఇస్తుంది. ధ్యానం, సస్టైనబుల్ లివింగ్ ఇష్టపడేవారికి ఇది మంచి ఎంపిక.

కూర్గ్…

పచ్చని కొండలు, కాఫీ తోటలు, చల్లని వాతావరణంతో కూర్గ్ వెల్‌నెస్ ట్రిప్‌కు అద్భుతమైన గమ్యం. స్పా థెరపీలు, ప్రకృతి మధ్య నడకతో పూర్తిగా రిలాక్స్ కావచ్చు. కొన్ని రోజులు మీ కోసం కేటాయించుకుని ప్రశాంతంగా గడపాలనుకుంటే.. ఈ వెల్‌నెస్ ట్రావెల్ డెస్టినేషన్స్ మీ లిస్ట్‌లో తప్పక ఉండాల్సినవే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు