Homeజాతీయందేశంలో మూడో ఫ్రంట్ ఏర్పాటుకు కేసిఆర్ స‌న్న‌హాలు...! బీజేపీ దూకుడుకు బ్రేక్ వేయాల‌ని ప్లాన్‌....

దేశంలో మూడో ఫ్రంట్ ఏర్పాటుకు కేసిఆర్ స‌న్న‌హాలు…! బీజేపీ దూకుడుకు బ్రేక్ వేయాల‌ని ప్లాన్‌….

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: కెసిఆర్ తృతీయ కూటమి వైపు అడుగులు వేస్తున్నారా? ఎన్డీఏ తో పాటు ఇండియా కూటమికి ప్రత్యామ్నాయ వేదిక తీసుకురానున్నరా? ఇదే మంచి సమయం అని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం బిజెపి హవా నడుస్తోంది. ఒక్కో రాష్ట్రం ఆ పార్టీకి చిక్కుతోంది. దీంతో బలమైన ప్రాంతీయ పార్టీల అధినేతలు ప్రతిపక్షానికి పరిమితం అవుతున్నారు. వారందరితో కలిసి ఇప్పుడు తృతీయ ఫ్రంట్ దిశగా కెసిఆర్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇండియా కూటమికి నో ఛాన్స్…

జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఉంది. కానీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోతోంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నీడలో పనిచేసేందుకు బలమైన ప్రాంతీయ పార్టీలు ముందుకు రావడం లేదు. దానికి కారణం ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థిగా ఉండడమే. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకత్వానికి ఇష్టపడని చాలా ప్రాంతీయ పార్టీలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తూ వస్తున్నాయి. అదే సమయంలో బిజెపి హవా పెరుగుతోంది. బిజెపి దూకుడుకు కళ్లెం వేసే విధంగా.. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ వేదికగా ఉండే కూటమి కోసం ఈ బలమైన ప్రాంతీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. వారందరినీ ఇప్పుడు ఏకతాటి పైకి తెచ్చే పనిలో ఉన్నారు కెసిఆర్.

ఆ నేతలంతా ఏకతాటిపైకి..

దేశంలో గత కొన్నేళ్ల పరిణామాలు చూస్తే చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కుప్పకూలిపోయాయి. బిజెపి బాధిత పార్టీలుగా మిగిలిపోయాయి. అరవింద్ కేజ్రీవాల్, ఉద్దవ్ ఠాక్రె, మమతా బెనర్జీ, స్టాలిన్, జగన్మోహన్ రెడ్డి, కెసిఆర్, శరద్ పవర్, అఖిలేష్ యాదవ్, బీహార్ లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులు.. ఇలా వీరందరినీ ఏకతాటిపైకి తెస్తే మూడో ఫ్రెంట్ ఖాయమని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. గతంలో కూడా కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు మూడో ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేశారు. కానీ అప్పట్లో ఉన్న పరిస్థితులు వేరు. ఇప్పుడు కచ్చితంగా కెసిఆర్ పావులు కలిపితే కచ్చితంగా మూడో ఫ్రంట్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. బిజెపికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఈ ఫ్రంట్ కు బలమైన ప్రాంతీయ పార్టీలన్నీ మద్దతు తెలిపే అవకాశం ఉంది. మరి కెసిఆర్ ప్రయత్నాలు ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు