Homeక్రైమ్NEET లీక్ కేసులో ఆ ఇద్దరివెనుక ఒకే మహిళ!

NEET లీక్ కేసులో ఆ ఇద్దరివెనుక ఒకే మహిళ!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ ప్రశ్నపత్రాల లీక్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పుణెకు చెందిన సీనియర్ బయాలజీ ఉపాధ్యాయురాలు మనీషా గురునాథ్ మాంధరేను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఎన్టీఏ నిపుణురాలిగా వ్యవహరిస్తూనే ప్రశ్నపత్రాల సమాచారాన్ని అక్రమంగా సేకరించి విద్యార్థులకు లీక్ చేసినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. తన ఇంట్లోనే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ బయాలజీ ప్రశ్నలను ఎంపిక చేసిన విద్యార్థులకు అందించినట్లు సీబీఐ గుర్తించింది. ముఖ్యంగా ఆమె విద్యార్థులకు నోట్ చేయించిన ప్రశ్నలే అసలు నీట్ పరీక్ష ప్రశ్నపత్రంలో కనిపించడంతో అధికారులు షాక్‌కు గురయ్యారు. ఈ కేసులో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా అరెస్టయిన వారి సంఖ్య 9కి చేరింది. నిందితులు డబ్బున్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. కేసు దర్యాప్తులో భాగంగా 6 ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించిన అధికారులు కీలక ల్యాప్‌టాప్‌లు, డిజిటల్ పరికరాలు, బ్యాంక్ స్టేట్‌మెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇక నీట్-యూజీ ప్రశ్నపత్రాల లీక్ కేసులో అరెస్టయిన మరో ప్రధాన నిందితుడు పీవీ కులకర్ణి, అతని సహాయకురాలు మనీషా వాఘ్మారేలను సీబీఐ అధికారులు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ ఇద్దరిని కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న అరెస్టయిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ కులకర్ణి, ఈరోజు అరెస్టయిన బయాలజీ ఉపాధ్యాయురాలు మనీషా గురునాథ్ ఇద్దరి వెనుక కూడా మనీషా వాఘ్మారే కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ గుర్తించింది. ఈ ముగ్గురు కలిసి ఒక సిండికేట్‌లా వ్యవహరిస్తూ ప్రశ్నపత్రాల లీక్ నెట్‌వర్క్‌ను నడిపినట్లు సమాచారం. ఎన్టీఏ నిపుణులుగా పనిచేస్తూనే అక్రమాలకు పాల్పడటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

దర్యాప్తులో బయటపడుతున్న వివరాల ప్రకారం.. కులకర్ణి, మనీషా గురునాథ్ కలిసి డబ్బున్న విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ మొత్తం వ్యవహారంలో మధ్యవర్తిగా మనీషా వాఘ్మారే వ్యవహరించినట్లు అధికారులు గుర్తించారు. విద్యార్థులను సంప్రదించడం, భారీ మొత్తాలు వసూలు చేయడం, ప్రశ్నల సమాచారాన్ని చేరవేయడం వంటి వ్యవహారాలను ఆమె సమన్వయం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె బ్యాంక్ ఖాతాలను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. ఆర్థిక లావాదేవీల వివరాలను విశ్లేషిస్తున్న అధికారులు ఈ కేసులో మరింత పెద్ద నెట్‌వర్క్ ఉండే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్న దర్యాప్తు సంస్థ, త్వరలోనే మరిన్ని అరెస్టులు చేసే అవకాశముందని సమాచారం. దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించిన ఈ కేసులో ప్రతి అంశాన్ని లోతుగా విచారిస్తున్నట్లు సీబీఐ వెల్లడించింది.

ALSO READ: ఇంధన సంక్షోభంపై ప్రపంచానికి ప్రధాని మోదీ వార్నింగ్

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు