విజయవాడ, క్రైమ్‌మిర్రర్: ప్రభుత్వ ఆసుపత్రి లో పనచేస్తున్న డాక్టర్ పై రేప్, ఆట్రాసిటీ కేసు నమోదయింది. నిందితుడు తనకు పెళ్లైన విషయం దాచి నర్సును రెండో వివాహం చేసుకొని నాలుగేళ్లు కాపురం చేసాడు. మొదటి భార్యకు రెండో వివాహ వ్యవహారం తెలిసింది. దాంతో డాక్టర్ అప్పటి నుంచి రెండో భార్య దగ్గరకు వెళ్లడంలేదు. డాక్టర్ను రెండో భార్య నిలదీసింది. అప్పుడు మొదటి వివాహ విషయం బయటపడింది.
పిల్లలు అప్పుడే వద్దంటూ రెండో భార్యకు నిందితుడు రెండుసార్లు అబార్షన్ చేయించాడు. పెళ్లయిన విషయం దాచి మోసం చేశాడంటూ మహిళా పోలీస్ స్టేషన్ లో రెండో భార్య పిర్యాదు చేసింది. ఎన్టీఆర్ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. రేప్ కేసుతో పాటు అట్రాసిటీ కేసు సైతం నమోదు చేసారు.