Homeజాతీయంకేరళం సీఎంగా వీడీ సతీశన్...! ఆయ‌న బ్యాక్ గ్రౌండ్ ఇదే...

కేరళం సీఎంగా వీడీ సతీశన్…! ఆయ‌న బ్యాక్ గ్రౌండ్ ఇదే…

తిరునంతపురం, క్రైమ్‌మిర్ర‌ర్‌: కేరళం ముఖ్యమంత్రిగా వీడీ సతీషన్ పేరును కాంగ్రెప్ హై కమాండ్ గురువారం ప్రకటించింది. ఎర్నాకుళం జిల్లా నెట్టూరు జన్మించిన సతీష్ ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సోషల్ వర్కులో మాస్టర్స్, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం చదివారు. కేరళం హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసారు. కాంగ్రెస్ విద్యార్థి విభాగం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2001లో తొలిసారి పరవూరు నుంచి ఎమ్మెల్యే అయ్యారు.

పరవూరు నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2026లో పరవూరులో కేఎం దినకరన్, 2011లో సీపీఎం నేత పన్నయన్ రవీంద్రన్పై విజయం సాధించారు. 2016లో శారదా మోహన్పై 20,634 ఓట్ల తేడాతో గెలుపోందారు. 12వ అసెంబ్లీలో భారత జాతీయ కాంగ్రెస్ చీఫ్ విప్గా బాధ్యతలు నిర్వహించారు. 2021లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్గా నియామకం అయ్యారు. 2026 కేరళం ఎన్నికల్లో గెలుపులో అయన కీలక పాత్ర పోషించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు