HomeజాతీయంVijay: విజయ్ అధికారం పదిలం ... అసెంబ్లీలో నెగ్గిన బలపరీక్ష ...!

Vijay: విజయ్ అధికారం పదిలం … అసెంబ్లీలో నెగ్గిన బలపరీక్ష …!

  • మ్యాజిక్ ఫిగర్ కంటే 26 మంది ఎమ్మెల్యేలు అదనపు మద్దతు

  • అన్నా డీఎంకే చీలిక వర్గంతో సునాయాసంగా గట్టెక్కిన వైనం

  • డీఎంకే సభ బహిష్కరణ

క్రైమ్ మిర్రర్, తమిళనాడు బ్యూరో: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అనుకున్నది సాధించారు. బలపరీక్షలో నెగ్గారు. అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. బుధవారం జరిగిన బలపరీక్షలు విజయ నేతృత్వంలోని ప్రభుత్వం 144 ఓట్ల మెజారిటీతో నెగ్గింది. మొత్తం 234 స్థానాలు ఉన్న అసెంబ్లీలో.. మెజారిటీ మార్కు 118 కాగా.. మరో 24 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా పొందింది. విజయ్ ఆశించిన దానికంటే ఎక్కువ మద్దతు లభించింది. దీంతో ఆయన అధికారానికి తాత్కాలికంగా ఎటువంటి డోకా లేదు.

అతిపెద్ద పార్టీగా…

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీ కే అతి పెద్ద పార్టీగా అవతరించింది. సాధారణ మెజారిటీకి కూత వేటు దూరంలో నిలిచిపోయింది ఆ పార్టీ బలం. 234 స్థానాలు ఉన్న తమిళనాడులో టీవీ కేకు దక్కిన నియోజకవర్గాలు 107. మొత్తం 108 స్థానాలను ఆ పార్టీ దక్కించుకుంది. కానీ రెండు చోట్ల పోటీ చేసిన విజయ్ గెలిచారు. దీంతో ఒక నియోజకవర్గానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో విజయ్ బలం 107కు పడిపోయింది. అయితే నాటకీయ పరిణామాల నడుమ విజయ్ కు కాంగ్రెస్, వి సి కె, సిపిఐ, సిపిఎం తదితర పార్టీలు మద్దతు ప్రకటించాయి. మరోవైపు అన్నాడీఎంకే లో చీలిక వర్గంలో ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు సైతం విజయ్ ప్రభుత్వానికి జై కొట్టారు. దీంతో టీవీ కె సునాయాసంగా బలపరీక్షను నెగ్గింది.

హార్స్ ట్రేడింగ్ అంటూ డిఎంకె ఆరోపణ …

మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న డీఎంకే సభ నుంచి వాకౌట్ చేసింది. ప్రతిపక్ష నేత ఉదయనిది స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే సభ్యులు అసెంబ్లీలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఓటింగ్ కు ముందే డీఎంకే ఎమ్మెల్యేలందరూ సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు టీవీకెను వ్యతిరేకించిన విషయాన్ని లెక్కలతో సహా చెప్పుకొచ్చారు ఉదయనిది స్టాలిన్. హార్స్ ట్రేడింగ్ కు పాల్పడుతున్నారని.. అవినీతిపరుల మద్దతు తీసుకుంటున్నారని విమర్శలు చేశారు. మరోవైపు బిజెపి ఈ ఓటింగ్ లో తటస్థంగా ఉంది. పిఎంకె ఎమ్మెల్యేలు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. పళని స్వామి వెనుక ఉన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఓటింగ్ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి విజయ్ తన ప్రభుత్వం సెక్యులర్ మార్గంలో నడుస్తుందని స్పష్టం చేశారు. బలపరీక్ష ముగిసిన అనంతరం స్పీకర్ ప్రభాకర్ అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు