Homeజాతీయంటీఎంసీ అధినేత్రికి మ‌రో ఛాన్స్‌...!

టీఎంసీ అధినేత్రికి మ‌రో ఛాన్స్‌…!

  • నందిగ్రామ్ స్థానానికి రాజీనామా చేసిన సీఎం సువేందు

  • గతంలో ఇదే స్థానం నుంచి ఓడిపోయిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి

  • మరోసారి ఆ సాహసం చేస్తారా..?

  • తేలని విపక్ష నేత ఎంపిక

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష నేత ఎవరు…? తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎవరు ఎంపిక అవుతారు? బిజెపిని ఢీకొట్టే సమర్ధుడైన నాయకుడు ఎవరు? పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందూ అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులు ప్రమాణం చేశారు. కానీ తృణముల్ కాంగ్రెస్ నుంచి ప్రతిపక్ష నేత ఎవరన్నది ఇంతవరకు క్లారిటీ లేదు.

ప్రతిపక్ష నేత కోసం…

తృణమూల్ కాంగ్రెస్ లో మమతా బెనర్జీ తర్వాత.. ఎవరు అంటే అభిషేక్ బెనర్జీ పేరు వినిపిస్తుంది. కానీ ఆయన ఎంపీగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు మమతా బెనర్జీ ఓడిపోయారు. దీంతో పార్టీ శాసనసభ పక్ష నేత ఎవరు అనేది ఇంతవరకు క్లారిటీ రావడం లేదు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోవడం అనేది కీలక మలుపు. కానీ ఇప్పుడు ఆమెకు ఎమ్మెల్యేగా గెలిచే ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఎంపికైన సువేందూ అధికారి రెండు చోట్ల పోటీ చేశారు. నందిగ్రామ్ తో పాటు భవానిపూర్ లో విజయం సాధించారు. అయితే మమతా బెనర్జీ సొంత కోట అయిన భవానీపూర్ స్థానాన్ని తన వద్ద ఉంచుకోవాలని భావిస్తున్నారు. తన రాజకీయ కంచుకోటగా భావించే నందిగ్రామ్ స్థానానికి మాత్రం ఆయన రాజీనామా చేశారు.

నందిగ్రామ్ కంచుకోట…

నందిగ్రామ్ అంటే సువేందూ అధికారి రాజకీయ కోట. సాధారణంగా సొంత నియోజకవర్గాన్ని వదులుకునేందుకు ఎవరు ఇష్టపడరు. కానీ వ్యూహాత్మకంగా సువేందు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉంది. భవానిపూర్ స్థానాన్ని మమతా బెనర్జీకి దక్కకుండా చేయడమే ఆయన ప్రధాన ఉద్దేశం. ఒకవేళ భవానిపూర్ కు రాజీనామా చేసి ఉంటే.. బై ఎలక్షన్ లో సానుభూతి ద్వారా మమతా బెనర్జీ గట్టక్కవచ్చు. అసెంబ్లీలో అడుగుపెట్టి అవకాశం ఉంది. అది జరగకుండా ఉండాలంటే భవానీపూర్ నియోజకవర్గాన్ని తన వద్ద ఉంచుకోవాలి. తనకు పట్టున్న నందిగ్రామ్ లో మమతా బెనర్జీని మరోసారి ఓడించడం ద్వారా రాజకీయంగా దెబ్బతీయాలన్నది సువేందు ప్రణాళిక.

డైలమాలో టిఎంసి...

అయితే తాజా పరిణామాలతో తృణమూల్ కాంగ్రెస్ డైలమాలో పడింది. ఎందుకంటే ఇదే నందిగ్రామ్ లో 2021 ఎన్నికల్లో ఓడిపోయారు మమతా బెనర్జీ. ఆ చేదు అనుభవం ఇప్పటికీ వెంటాడుతోంది. పైగా బీజేపీ అధికారంలో ఉంది. అధికారి కంచుకోట. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పోటీ చేస్తే బిజెపి రికార్డు విజయం సాధిస్తుంది. అది అసలకే ఎసరు వస్తుంది. కానీ మమతా బెనర్జీ మొండిఘటం. తప్పకుండా నందిగ్రామ్ లో పోటీ చేసి తన పట్టు నిలుపుకుంటారని తృణమూల్ కాంగ్రెస్ భావిస్తోంది.. కానీ అది తృణముల్ కాంగ్రెస్ నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు