Homeక్రైమ్సీతాఫల్‌మండి లో దారుణ హత్య...వెంబడించి మరీ..!

సీతాఫల్‌మండి లో దారుణ హత్య…వెంబడించి మరీ..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: ప్రేమ వ్యవహారం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. హైదరాబాద్‌లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జవహర్‌నగర్‌కు చెందిన యావన్ (23), అతను ఒక ప్రైవేట్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. నేపథ్యంలో యావన్ గత నాలుగేళ్లుగా సీతాఫల్‌మండికి చెందిన ఒక యువతితో ప్రేమలో ఉన్నాడని సమాచారం.

వీరి బంధాన్ని వ్యతిరేకించిన యువతి బంధువులు, గతంలోనే అతన్ని హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు. ఐతే క్రమంలో గురువారం రాత్రి (మే 7, 2026) యావన్ తన స్నేహితులతో కలిసి ఉండగా, మూడు బైక్‌లపై వచ్చిన ఆరుగురు దుండగులు కత్తులతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అతను తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, వెంబడించి మరీ 17 చోట్ల పొడిచి దారుణంగా హతమార్చారు.

ఈ హత్యకు నిరసనగా మృతుడి బంధువులు శుక్రవారం ఉదయం సీతాఫల్‌మండిలోని యువతి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించడంతో చిలకలగూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చిలకలగూడలో భారీగా పోలీసులను మోహరించారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు