Homeక్రైమ్Crime News: ఈత సరదా ముగ్గురు యువకులు మృతి...!

Crime News: ఈత సరదా ముగ్గురు యువకులు మృతి…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: వాగులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గ్రామ సమీపంలోని హల్దీ వాగులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన యెర్రగొల్ల ప్రశాంత్ (27), వికాస్ (26), మరియు కె. ఆనంద్ రెడ్డి (27) వీరు బుధవారం తూప్రాన్‌లో జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరై, గురువారం ఉదయం తిరుగు ప్రయాణంలో నాచారంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకున్నారు.

దర్శనం తర్వాత సరదాగా స్నానం చేసేందుకు ఈత కొట్టేందుకు హల్దీ వాగులోకి దిగారు. నీటి లోతును అంచనా వేయలేకపోవడం మరియు ఈత రాకపోవడంతో ముగ్గురూ వాగులో మునిగి మరణించారు. గజ ఈతగాళ్ల సహాయంతో పోలీసులు గాలింపు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి వేడుకకు వచ్చి ఇలా అకాల మరణం చెందడం ఆ కుటుంబాల్లోను, నర్సాపూర్ ప్రాంతంలోను తీవ్ర విషాదాన్ని నింపింది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు