HomeUncategorizedరాజకీయాల్లో రామనామం వివాదం: మంత్రి సురేఖ వ్యాఖ్యలపై హిందూ సంఘాల ఆగ్రహం!

రాజకీయాల్లో రామనామం వివాదం: మంత్రి సురేఖ వ్యాఖ్యలపై హిందూ సంఘాల ఆగ్రహం!

తెలంగాణ రాజకీయాల్లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రధాని మోడీ పర్యటనను పురస్కరించుకుని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. ముఖ్యంగా హిందూ నినాదమైన ‘జై శ్రీరామ్’ అంశంపై ఆమె స్పందించిన తీరు పట్ల బీజేపీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి దైవ చింతనను అవమానించడం సరికాదని కమలం పార్టీ నేతలు ధ్వజమెత్తుతున్నారు.

హాట్ టాపిక్ గా మంత్రి వ్యాఖ్యలు

మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ బీజేపీ నాయకులు కేవలం నినాదాలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. ‘జై శ్రీరామ్’ అంటే పైసలు రాలుతాయా లేక పథకాలు వస్తాయా అంటూ ఆమె ప్రశ్నించారు. ప్రధాని పర్యటన వేళ కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టడం మినహా బీజేపీ వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆమె ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ సంఘాలు రాజకీయ పార్టీల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

బీజేపీ తీవ్రస్థాయిలో ఫైర్

మంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధికారికంగా స్పందించింది. ఆమె దేవాదాయ శాఖ మంత్రి కాదు దైవద్రోహ శాఖ మంత్రి అంటూ ఎక్స్ వేదికగా ఘాటు విమర్శలు చేసింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ నాయకులు హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నారని మండిపడింది. శ్రీరాముడిని అపహాస్యం చేయడం అంటే హిందూ సమాజాన్ని అవమానించడమేనని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుళ్లను కించపరిచేలా మాట్లాడే వారికి మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో భక్తి భావాలను రాజకీయం చేయడం తగదని హిందూ సంఘాలు పేర్కొంటున్నాయి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు మతపరమైన నినాదాలను గౌరవించాలని సూచిస్తున్నారు. ఈ వివాదం రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.

ALSO READ: TMC Allegations: ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.5 కోట్ల డిమాండ్ అంటూ ఆరోపణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు