Homeఆంధ్ర ప్రదేశ్జనసేన రాజ్యసభ పదవి ఆయనకే...!

జనసేన రాజ్యసభ పదవి ఆయనకే…!

  • రేసులో ముందంజలో లింగమనేని రమేష్

  • తాజాగా మరో పారిశ్రామికవేత్త బండారు నరసింహారావు పేరు

  • టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సైతం ప్రయత్నాల్లో..

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. జూన్లో ఓ నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. రాష్ట్రంలో కూటమి ఏకపక్ష విజయంతో ఆ నాలుగు రాజ్యసభ సీట్లు కూటమికి దక్కనున్నాయి. అయితే పదవి విరమణ చేస్తున్న వారిలో టిడిపికి చెందిన సానా సతీష్ ఉన్నారు. ఆయన ఏడాది కిందట రాజ్యసభకు ప్రమోట్ అయ్యారు. అప్పట్లోనే ఆయనకు రెండోసారి రెన్యువల్ ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఆయననే కొనసాగించనున్నారు. మిగతా మూడు రాజ్యసభ పదవులు కూటమి పార్టీలు చెరో ఒకటి తీసుకోనున్నాయి. అందులో ఒకటి కచ్చితంగా జనసేన కు లభిస్తుంది. అయితే ఇది జనసేనకు తొలి రాజ్యసభ పదవి. ఆ పార్టీకి ఇప్పటివరకు లోక్సభలో మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. అందుకే రాజ్యసభ జనసేనలో ఎవరికి ఇస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్.

నాగబాబుకి తొలి ఛాన్స్..
వాస్తవానికి జనసేన ద్వారా రాజ్యసభకు నాగబాబును పంపించాలన్నది ఒక వ్యూహం. అయితే గతసారి వివిధ సమీకరణలో భాగంగా నాగబాబుకు చాన్స్ దక్కలేదు. దీంతో సీఎం చంద్రబాబు నాగబాబును ఏపీ క్యాబినేట్లోకి తీసుకుంటామని ప్రకటన చేశారు. అన్నట్టుగానే నాగబాబు కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో నాగబాబుకు ఇప్పుడు రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటికే ఉన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి.. రాజ్యసభకు ప్రమోట్ చేస్తారా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. అయితే త్వరలో మంత్రివర్గ విస్తరణలు నాగబాబు కు ఛాన్స్ ఖాయం అని ప్రచారం జరుగుతోంది. అందుకే రాజ్యసభకు పంపించకపోవచ్చు అనేది ఒక వాదన.

లింగమనేని వైపు మొగ్గు..
ఆది నుంచి జనసేనలో రాజ్యసభ పదవి అంటే పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు వినిపిస్తోంది. సాధారణంగా రాజ్యసభ అనేది పారిశ్రామిక వర్గాల నుంచి భర్తీ చేస్తుంటారు. అయితే ఇప్పుడు లింగం అనే నేను రమేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండడంతో ఆయనకు ఖరారు అవుతుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పైగా ఆయన సీఎం చంద్రబాబు కు అత్యంత సన్నిహితుడు కూడా. ప్రస్తుతం చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు లింగమనేని రమేష్ ది. మొన్నటి ఎన్నికల్లోనే జనసేన తరపున రమేష్ పోటీ చేయాల్సి ఉంది. కానీ వివిధ సమీకరణలో భాగంగా ఛాన్స్ దక్కలేదు. అందుకే ఆయనను ఈసారి రాజ్యసభకు పంపిస్తారని ఒక ప్రచారం అయితే ఆది నుంచి ఉంది. అయితే చివరి నిమిషంలో చేర్పులో మార్పులు సంభవిస్తే తప్ప లింగమనేని రమేష్ అభ్యర్థి అవుతారని ఒక ప్రచారం జోరుగా సాగుతోంది.

ఆ ఇద్దరు పేర్లు కొత్తగా..
అయితే తాజాగా మరో పారిశ్రామికవేత్త పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.
సిద్దార్థ్ ఇన్ఫ్రా టెక్ ఎండీ బండారు నరసింహ రావు పేరు ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఆయన 2024 ఎన్నికల్లో జనసేన తరఫున ఎంపీగా పోటీ చేయాలని చూశారు. కానీ అవకాశం చిక్కలేదు. అందుకే రాజ్యసభకు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. ఇంకో వైపు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత పేరు కూడా వినిపిస్తోంది. తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న ఆ నిర్మాత సైతం రాజ్యసభ పదవి విషయంలో ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారంలో ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు