క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న ముంబై ఇండియన్స్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భాగంగా మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్నిత 20 ఓవర్లకు 243 పరుగులు చేసింది. అనంతరం చేదనలో మేమేం తక్కువ కాదు అంటూ మరో 8 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేదించింది హైదరాబాద్ జట్టు. అయితే వరుసగా ఐదు విజయాలను నమోదు చేసిన హైదరాబాద్ జట్టులో ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్యాట్స్మెన్ అదరగొడుతున్నారు. ఇప్పటివరకు ఆరు మ్యాచుల్లో సన్రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించగా ఆరు మ్యాచ్ల లో వేరువేరు ఆటగాళ్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. కోల్కత్తా జట్టుపై నితీష్ కుమార్ రెడ్డి, రాజస్థాన్ రాయల్స్ పై ప్రఫుల్, చెన్నై సూపర్ కింగ్స్ పై మలింగా, ఢిల్లీ క్యాపిటల్స్ పై అభిషేక్ శర్మ, రాజస్థాన్ రాయల్స్ పై (2) కిషన్, ముంబై ఇండియన్స్ పై క్లాసన్. ఇలా ప్రతి మ్యాచ్లోను ఒక్కొక్క ప్లేయర్ కీలకంగా మారుతుండడంతో హైదరాబాద్ జట్టు వరుసగా విజయాలను నమోదు చేస్తుంది. ఈ సీజన్లో హైదరాబాద్ జట్టుకు తిరుగులేదు అని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి చాలా ఏళ్ల తర్వాత ఈసారైనా హైదరాబాద్ ఫ్యాన్స్ కలను నిజం చేస్తుందా?..
“పెద్దల మాట చద్దన్నం మూట” ఈ సామెత ఎందుకన్నారో తెలుసా?
Defamation Case: రూ.20 కోట్ల కేసు.. 20 ఏళ్ల వాయిదా, 90 ఏళ్ల ముసలమ్మ కేసులో కోర్టు షాకింగ్ డెసిషన్!