Homeఆంధ్ర ప్రదేశ్తెలుగు రాష్ట్రాల్లో నిప్పులు చెరుగుతున్న సూర్యుడు!

తెలుగు రాష్ట్రాల్లో నిప్పులు చెరుగుతున్న సూర్యుడు!

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. సూర్యుడు వేడిగాలులకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఒక వైపు తెలంగాణ మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. గత కొద్ది రోజుల క్రితం వరకు 42 డిగ్రీల వరకు ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు ఈరోజు ఏకంగా 46 డిగ్రీల వరకు చేరుకున్నాయి. దీన్నిబట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నిర్మల్ జిల్లా దుస్తురాబాద్ లో ఏకంగా 46 డిగ్రీల టెంపరేచర్ నమోదయింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కొమ్మెలపాడులో 44.1° ఉష్ణోగ్రత రికార్డు నమోదవడంతో ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఒకవైపు ప్రజలు మరోవైపు మూగజీవాలు ఎండ దాటికి విలవిలలాడుతున్నాయి. రాబోయే రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశాలు ఉన్నాయని తాజాగా వాతావరణ శాఖ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎవరూ కూడా అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దు అని సూచించారు. కాగా ఇప్పటికే చాలామంది వడదెబ్బ కారణంగా చనిపోయిన సందర్భాలు నిత్యం మన సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఎండల పట్ల ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు వహించాలి అని అధికారులు సూచించారు.

ఒక్కో మ్యాచ్ లో ఒక్కో హీరో.. ఇది కదా టీం స్పిరిట్ అంటే?

“పెద్దల మాట చద్దన్నం మూట” ఈ సామెత ఎందుకన్నారో తెలుసా?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు