Homeలైఫ్ స్టైల్"పెద్దల మాట చద్దన్నం మూట" ఈ సామెత ఎందుకన్నారో తెలుసా?

“పెద్దల మాట చద్దన్నం మూట” ఈ సామెత ఎందుకన్నారో తెలుసా?

క్రైమ్ మిర్రర్, లైఫ్ స్టైల్ :- ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఇప్పటివరకు సంపాదించుకున్న డబ్బంతా కూడా అయిపోగొట్టుకుంటున్నారు. ఒకప్పటి కాలంలో ఆసుపత్రులు చుట్టూ పెద్దగా ఎవరూ తిరిగేవారు కాదు. కానీ ఈ రోజుల్లో మాత్రం చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్య బారినపడి ఆసుపత్రులలో చికిత్స పొందుతూ కాలాన్ని గడుపుతున్నారు. 90s కు మరియు ఇప్పటి జనరేషన్ కు తేడా చూస్తే ఖచ్చితంగా అప్పటి జనరేషన్ వారే ఇప్పటికీ చాలా బలంగా కనిపిస్తారు.

Kohinoor Diamond: కోహినూర్ ను భారత్ కు ఇవ్వాల్సిందే, న్యూయార్క్ మేయర్ కీలక వ్యాఖ్యలు!

ఇప్పటికీ మనం ఎన్నో సందర్భాలలో “పెద్దల మాట చద్దన్నం మూట” అనే సామెత వినే ఉంటాం. ఉదయాన్నే పెరుగు మరియు ఉల్లిపాయ కలిపిన సద్దన్నం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి అని బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. అయితే ఈ సామెత వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. మన నాన్న మరియు తాతల కాలంలో ఈ చద్దన్నం తింటూ మంచి ఆరోగ్యంతో ఉంటూ కాలాన్ని గడుపుతూ వచ్చారు. ఒక విధంగా చెప్పాలి అంటే చద్దన్నం అనేది మనిషి ఆరోగ్యానికి ఎంతో ఆరోగ్యకరం. రాత్రంతా పెరుగుతో అన్నాన్ని పులియబెట్టడం వల్ల ఐరన్, కాల్షియం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలను శరీరం త్వరగా గ్రహిస్తుంది. ప్రతిరోజు ఉదయం ఈ చద్దన్నం తినడం వల్ల శరీరంలో ఉన్నటువంటి వేడి మొత్తం పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే ఈ వేసవికాలంలో వడదెబ్బ, అలసట మరియు చర్మ సమస్యల నుంచి పూర్తిగా విషమనం పొందవచ్చు. ఈ చద్దన్నం కారణంగానే జీర్ణ వ్యవస్థ మెరుగుపడి మలబద్ధకం సమస్య అనేది మీ దరిదాపులో కూడా చేరదు. కాబట్టి ప్రతిరోజు ఈ చద్దన్నం తినడం వల్ల శరీరానికి ఎంతో మంచిది. చద్దన్నం అంటే ఏంటో మీకు తెలియకపోతే మీ తల్లిదండ్రులను లేదా అవ్వ తాతలను అడిగి తెలుసుకోండి

గులాబీ బాస్‌ ఫ్యామిలీ గేమ్… అంతా రాజ‌కీయ చ‌ద‌రంగ‌మే…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు