Homeతెలంగాణదాహంతో అలమటిస్తున్న ఫిరోజ్ నగర్...!

దాహంతో అలమటిస్తున్న ఫిరోజ్ నగర్…!

  • మిషన్ భగీరథ నీళ్ల జాడెక్కడ. .మళ్లీ పాత రోజుల్లోకి గ్రామం

 

రంగారెడ్డి ప్ర‌తినిధి,క్రైమ్ మిర్రర్ : ప్రభుత్వాలు మారుతున్నా, పథకాలు వస్తున్నా ఆ గ్రామానికి మాత్రం ‘జల’ కష్టాలు తప్పడం లేదు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఫిరోజ్ నగర్ గ్రామంలో పాలక వర్గం నిద్ర మత్తుల్లో వ్యవహారిస్తుందని గ్రామస్తులు అగ్రహావ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం త్రాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. చుక్క నీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి రావడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ​అయోమయంలో ‘మిషన్ భగీరథ ​ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చామని ప్రభుత్వం చెబుతున్నా, ఫిరోజ్ నగర్‌లో పరిస్థితి మాత్రం మండలం లో ఏ గ్రామం లో లేని విరుద్ధంగా ఉంది.

నల్లాలు ఉన్నా నీరు రాకపోవడంతో ఆ పైపులు కేవలం అలంకారప్రాయంగానే మిగిలాయి. అధికారులు ట్టించుకోకపోవడంతో గ్రామస్థులు మళ్లీ పాత రోజుల్లాగే వ్యవసాయ బావుల వద్దకు, దూరంగా ఉన్న బోర్ల వద్దకు పరుగులు తీయాల్సిన దుస్థితి ఏర్పడింది.గ్రామస్థులు పాలక వర్గాన్ని ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్ లో సంబంధిత వ్యక్తులతో పిర్యాదులు చేస్తున్నారని వార్డ్ సభ్యులు మండిపడ్తున్నారు.

​గ్రామస్థుల ఆవేదన…

​పాత రోజులు గుర్తుకొస్తున్నాయి: ఒకప్పుడు బిందెడు నీళ్ల కోసం పడ్డ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఎండలు ముదరకముందే ఈ పరిస్థితి ఉంటే, రాబోయే రోజుల్లో ఎలా బతకాలి అని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ​వ్యవసాయ బావులే ఆధారం: త్రాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్థులు విధిలేక వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి కలుషిత నీటిని తెచ్చుకుంటున్నారు.

దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ​నిర్లక్ష్యం వీడాలి: స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు సమస్యను విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి రోజంతా నీళ్ల కోసమే సరిపోతోంది. అధికారులు వెంటనే స్పందించి మా ఊరికి శాశ్వత త్రాగునీటి సౌకర్యం కల్పించాలి.”

ఫిరోజ్ నగర్ గ్రామస్థులు ​డిమాండ్…

​వెంటనే ఉన్నతాధికారులు స్పందించి, ఫిరోజ్ నగర్ గ్రామంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని, మిషన్ భగీరథ ద్వారా క్రమం తప్పకుండా నీరు విడుదల చేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు