Monday, March 23, 2026
Homeతెలంగాణజిల్లా పరిషత్ పాఠశాల‌ ఆకస్మిక తనిఖీ

జిల్లా పరిషత్ పాఠశాల‌ ఆకస్మిక తనిఖీ

  • విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించాలి
  • మ‌ధ్యాహ్న భోజ‌నంలో నాణ్య‌త పాటించాలి
  • జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

కోరుట్ల,క్రైం మిర్ర‌ర్ః
నియోజకవర్గంలోని మెట్ పెల్లి మండలం బండ లింగపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆకస్మికంగా త‌నిఖీ చేశారు.

పాఠశాలలో విద్య బోధన విధానం, విద్యార్థుల హాజరు,మధ్యాహ్న భోజన పథకం అమలు,మౌలిక వసతులను పరిశీలించారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. తరగతి గదిలో విద్యార్థుల పాఠ్యంశాల్లోని సెలబస్ ను అడిగి తెలుసుకున్నారు.

ప‌ట్టుద‌ల‌తో చ‌దివి మంచి మార్కులు తెచ్చుకోవాలి….

పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు పట్టుదలతో చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆకాక్షించారు.పదవ తరగతి మ్యాథ్స్ సబ్జెక్టు నోట్ బుక్‌లను పరిశీలించారు.

గణితం విషయంలో పిల్లలు కొంచెం వెనుకంజలో ఉన్నారని ఇంకా పురోగతి సాధించేలా చర్యలు తీసుకోవాలని,పదో తరగతి పరీక్షలకు రైటింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తేనే మంచి మార్కులు వస్తాయని విద్యార్థులకు సూచించారు.

అదే విధంగా చదువుకుంటే కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు తెలియజేసి ప్రోత్సాహించారు.అనంతరం ఎంపీపీఎస్ పాఠశాలలోని 3వ తరగతి ఎఫ్ ఎల్ ఎన్ పై పలు ప్రశ్నలు అడిగారు.

మధ్యాహ్న భోజనంలో నాణ్యతను తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకు పోషకాహారం అందేలా చూడాలని సూచించారు.

పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపి అవగాహన కల్పించాలన్నారు.

పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందే విధంగా సంబంధిత శాఖలు సమన్వయం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్,జిల్లా విద్యాధికారి కె.రాము, ఎంఈవో చంద్ర శేఖర్,మండల తహసిల్దార్ నీత, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments