Homeక్రైమ్Legal affair: 15 రోజులు ప్రియుడితో ఉండేందుకు అనుమతి కోరిన భార్య

Legal affair: 15 రోజులు ప్రియుడితో ఉండేందుకు అనుమతి కోరిన భార్య

క్రైమ్ మిర్రర్, సోషల్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికంగా కాకుండా పరిసర ప్రాంతాల్లోనూ తీవ్ర చర్చకు దారి తీసింది. ఏడాదిన్నర క్రితమే వివాహమైన ఓ మహిళ, నెలలో 15 రోజులు తన భర్తతో, మిగిలిన 15 రోజులు తన ప్రియుడితో కలిసి గడిపేందుకు అనుమతించాలని గ్రామ పెద్దలను బహిరంగంగా డిమాండ్ చేయడం కలకలం రేపింది.

 

వివరాల ప్రకారం, ఆ మహిళకు వివాహమైన కొద్ది రోజులకే మరో యువకుడితో ప్రేమ సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె తొమ్మిది సార్లు తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయిందని సమాచారం. ప్రతి సారి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దల జోక్యంతో ఆమెను తిరిగి భర్త ఇంటికి తీసుకొచ్చారు.

 

అయితే తాజా ఘటనలో ఆమె నేరుగా గ్రామ పంచాయతీ ముందుకు వెళ్లి, ఇద్దరితో సమానంగా జీవించే హక్కు తనకుందని వాదించింది. తన మనసుకు నచ్చిన విధంగా జీవించాలి.. అంటూ గట్టిగా పట్టుబడడంతో గ్రామ పెద్దలు, గ్రామస్థులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

 

ఈ పరిణామాలతో భర్త తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. గ్రామ పెద్దల సమక్షంలో ఆయన భావోద్వేగంగా మాట్లాడుతూ, నేను ఎన్నిసార్లు క్షమించాను. అయినా ఆమె మనసు మారలేదు. ఇక ఆమె సంతోషంగా ఉండాలంటే ప్రియుడితోనే ఉండటం మంచిదేమో.. అంటూ వేదన వ్యక్తం చేశాడు.

 

ఆమెను బలవంతంగా తనతో ఉంచుకోవడం తనకు ఇష్టం లేదని కూడా స్పష్టం చేశాడు. ఈ ఘటన గ్రామంలోనే కాకుండా సమీప గ్రామాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. సంప్రదాయాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, కుటుంబ విలువలు మధ్య సమతుల్యత ఎలా ఉండాలన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మహిళ వ్యక్తిగత స్వేచ్ఛను సమర్థిస్తుండగా, మరికొందరు సామాజిక విలువలు దెబ్బతింటాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు