Homeక్రైమ్Breaking News: హబ్సిగూడలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య..!

Breaking News: హబ్సిగూడలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య..!

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై పదోవతర్గతి విద్యార్దిని ఐదంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం  హైదరాబాద్‌లోని హబ్సిగూడలో చోటుచేసుకుంది.  స్తానీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంగా…

మంగళవారం (నవంబర్ 25, 2025)  తెల్లవారుజామున శ్రీ వైష్ణవి అనే 15 ఏళ్ల విద్యార్థిని ఐదంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది అన్నారు. అయితే పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందని తెలిపారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనపై మరింత సమాచారం పోలీసుల విచారణ తర్వాత తెలియాల్సి ఉంది అన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు