Homeతెలంగాణబండి భగీరథ్ కస్టడీ ఎందుకు కోరడంలేదు ...! ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌...

బండి భగీరథ్ కస్టడీ ఎందుకు కోరడంలేదు …! ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌…

హైదరాబాద్, క్రైమ్‌మిర్ర‌ర్‌:  బండి భగీరథ్ లొంగిపోయి 5 రోజులు గడుస్తున్నా ఇంత వరకు పోలీసులు అతని కస్టడీ కోరలేదు. పోలీస్ కస్టడీకి ఇంకా సమయం ఉంది కానీ మీ కాంగ్రెస్ ఎంపీ మాట్లాడే మాటలు, బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడే మాటలు చూస్తే బాధితురాలికి న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు. వేరే కేసుల్లో రోజుకొక ప్రెస్ లీక్ ఇచ్చే మీరు ఈ కేసులో ఎందుకు ఇవ్వట్లేదని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్లో బండి సంజయ్ పేరు ఎందుకు లేదు? బండి సంజయ్ ఇంటికి వెళ్తే బాధితురాలిని అవమానించే విధంగా మాట్లాడాడని ఎఫ్ఐఆర్లో ఉంది. పైగా నా కొడుకు నా దగ్గరే ఉన్నాడు, బెయిల్ వస్తుందని సరెండర్ చేయలేదని అతనే చెప్తున్నాడు.

నేరం రుజువైతే 20 ఏళ్ల జైలు శిక్ష పడే ఒక నిందితుడిని 9 రోజులు కాపాడాను అని చెప్తుంటే, బండి సంజయ్ పేరు ఎఫ్ఐఆర్లో ఎందుకు లేదని అయన నిలదీసారు. ప్రధాని మోడీ బండి బండి సంజ‌య్ కాపాడమని రేవంత్ రెడ్డికి చెప్పాడు. నువ్వు ఏ దేవుడి దగ్గరికి రమ్మన్నా వస్తా.. బండి బండి సంజ‌య్ తీసుకురండి, మీరు కూడా రండి, తడి బట్టల మీద ప్రమాణం చేద్దాము. బండి సంజయ్ని కాపాడమని మోడీ మీతో చెప్పలేదా.. అందుకే మీరు 9 రోజులు అతన్ని అరెస్ట్ చేయలేదని అన్నారు. బండి భగీరథ్ పోలీసులకు ఇచ్చిన మొబైల్ ఫోన్ అతనిది కాదని బాధితురాలి కుటుంబం అంటుంది, దానికి మీ సమాధానం ఏంటని అయన ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు