Homeఆంధ్ర ప్రదేశ్తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ.. పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు నమోదు

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ.. పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు నమోదు

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. భానుడు నిప్పులు చెరుగుతున్నట్టుగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే మండిపోతున్న ఎండలతో ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది.ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం, కృష్ణా జిల్లా నందివాడలో 47.6 డిగ్రీలు నమోదు కాగా.. ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

అదేవిధంగా ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47.3 డిగ్రీలు, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 46.6 డిగ్రీలు, పోలవరం జిల్లా కూనవరంలో 46.5 డిగ్రీలు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా కావలిలో 46.4 డిగ్రీలు, గుంటూరు జిల్లా తెనాలిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.తెలంగాణలో కూడా ఎండల తీవ్రత అధికంగానే కనిపిస్తోంది. పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.5 డిగ్రీలు నమోదు కాగా.. సూర్యాపేట జిల్లా మునగాలలో కూడా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో 46.4 డిగ్రీలు, మహబూబాబాద్ జిల్లా కురవిలో 46.3 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో 46.2 డిగ్రీలు నమోదయ్యాయి.

వాతావరణ శాఖ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో 18 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే తెలంగాణలో 20 జిల్లాల్లో 46 డిగ్రీలకు సమీపంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ భీకరమైన ఎండలు ఇంకా కొన్ని రోజులు కొనసాగనున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావొద్దని, ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు