-
గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ భూములు
-
బాపు ఘాట్ వద్ద నిర్మాణానికి తొలగిన అడ్డంకులు
-
మరోసారి సత్తా చాటుకున్న సీఎం రేవంత్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: మూసీ నది పునరజ్జీవన ప్రాజెక్టులో ముందడుగు పడింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హైదరాబాద్ బాపు ఘాట్ వద్ద ప్రతిపాదించిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణానికి గాను.. కేంద్ర రక్షణ శాఖకు చెందిన అత్యంత విలువైన భూముల బదలాయింపునకు.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇండియన్ ఆర్మీ అధికారికంగా ఆమోదం తెలిపాయి. ఇది నిజంగా గొప్ప వార్త. కేంద్ర రాష్ట్ర విరుద్ధ ప్రభుత్వాలు ఉండగా.. కీలకమైన రక్షణ శాఖ భూముల బదలాయింపు జరగడం సాధారణ విషయం కాదు.
-
అంత సులువైన పని కాదు..
సాధారణంగా దేశ రక్షణకు సంబంధించిన స్థలాలను.. రాష్ట్రాల ప్రాజెక్టుల కోసం సాధించడం అంత సులువైన పని కాదు. కానీ సీఎం రేవంత్ లాబీయింగ్ జరిపారు. రక్షణ శాఖతో నిరంతర సంప్రదింపులు కొనసాగించారు. దాని ఫలితంగానే ఈ సంక్లిష్టమైన అనుమతి లభించడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త పరిణామం.
Also Read: రెండు నెలల చిన్నారిని నరికి చంపిన తండ్రి.. నిజామాబాద్‌లో దారుణ ఘటన! – Crime Mirror
సీఎం రేవంత్ ప్రదర్శించిన మార్కు రాజకీయం తెలంగాణలో అభినందనలు అందుకుంటుంది. కేంద్ర రక్షణ శాఖ అనుమతులు జారీపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా వేదికగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు, రక్షణ శాఖ అధికారులతో పాటు ఇండియన్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలిపారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కృతజ్ఞతలు తెలిపిన సీఎం రేవంత్ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరును కనీసం ప్రస్తావించలేదు.
-
కిషన్ రెడ్డి పై విమర్శలు..
మూసీ ప్రాజెక్టు విషయంలో గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ వర్సెస్ బిజెపి అన్నట్టు పరిస్థితి ఉంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రికి కిషన్ రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ యుద్ధం నడుస్తూ వచ్చింది. కిషన్ రెడ్డికి ఢిల్లీ స్థాయిలో పలుకుబడి లేదు.
తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు రప్పించడంలో ఆయన విఫలం అయ్యారు అంటూ రేవంత్ బహిరంగంగానే విమర్శలు చేస్తూ వచ్చారు ఇప్పుడు వచ్చిన అనుమతులు కూడా ఆయనకు సంబంధం లేదు అన్నట్టు ట్విట్ చేశారు.
Also Read: మూసీకి కొత్త జీవం.. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్!! – Crime Mirror
ప్రాజెక్టులు రానప్పుడు అడ్డుకుంటున్నారని నిందలు మాత్రం వేస్తున్నారని కిషన్ రెడ్డి అనుచరులు ఇప్పుడు ఆవేదనతో ఉన్నారు. అయితే తెలంగాణ బిజెపితో సంబంధం లేకుండా తానే నేరుగా మాట్లాడి ప్రాజెక్టులు తెచ్చుకుంటున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి.
బాపు ఘాట్ వద్ద 200 ఎకరాల్లో 133 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహం, మ్యూజియం, పీస్ సెంటర్తో నిర్మించబోయే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు రాజ్నాథ్ సింగ్ ను సీఎం రేవంత్ ఆహ్వానించారు. ఈ మొత్తం పరిణామంతో తెలంగాణ బిజెపి ఇరకాటంలో పడింది.
Also Read: కుక్క కోసం ఆవును కొన్నాడు…. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాడు – Crime Mirror