-
కర్నూలులో ఈనెల 24 నుంచి తవ్వకాలు
-
అధికారికంగా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో బంగారం గనుల్లో తవ్వకాలు ప్రారంభం కానున్నాయి. ప్రైవేటు భాగస్వామ్యంతో దేశీయ ఖనిజ రంగంలో సరికొత్త రికార్డు సృష్టించేందుకు ఏపీ సిద్ధమైంది. ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా తొలిసారిగా భారీ తరహా ప్రైవేటు బంగారు గాని ఏపీలో తన కార్యకలాపాలను ప్రారంభించబోతోంది.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి వద్ద ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఈనెల 24న సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రారంభించనున్నారు.
-
దేశీయ పసిడిరంగంలో..
గత కొద్ది రోజులుగా కర్నూలు జిల్లా జొన్నగిరి, ఎర్రగుడి, పగిడి రాయి గ్రామాల్లో విస్తరించి ఉన్న సుమారు 598 హెక్టార్ల లీజు భూమిలో గోల్డెన్ మైనింగ్ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ స్మైల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు.
Also Read: కుక్క కోసం ఆవును కొన్నాడు…. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాడు – Crime Mirror
అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ ప్రమాణాలతో.. కేవలం 13 నెలల రికార్డు కాలంలోనే ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. పైలెట్ రన్ ప్రక్రియను సైతం పూర్తి చేయగలిగారు.
ఈ ప్లాంట్ ద్వారా ఏటా సుమారు నాలుగు లక్షల టన్నుల బంగారు ఖనిజాన్ని ప్రాసెస్ చేయనున్నారు. అదే జరిగితే జొన్నగిరి గని దేశీయ పసిడిరంగంలో గేమ్ చేంజర్ గా నిలవనుంది.
ప్రాథమిక అన్వేషణ సక్సెస్ కావడంతో..
ఈ బంగారం గని అన్వేషణలు గత కొద్ది కాలంగా జరుగుతూ వచ్చాయి. ప్రాథమిక అన్వేషణలు జొన్నగిరి పరిధిలో దాదాపు 131 00 కిలోల బంగారు నిల్వలు ఉన్నట్లు జియో లాజికల్ సర్వేలు స్పష్టం చేశాయి.
మొత్తం లీజు మైనింగ్ ప్రాంతంలో అంచలంచలుగా జరిపిన లోతైన పరిశోధనల ప్రకారం.. ఇక్కడ ఏకంగా 42 టన్నుల నుంచి 50 వేల కిలోల వరకు పసిడి నిల్వలు పెరిగే అవకాశం ఉన్నట్టు మైనింగ్ నిపుణులు చెబుతున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి సగటున వెయ్యికిలోల శుద్ధి చేసిన విదేశీ ప్రమాణాల బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తానికి అయితే ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే ఏపీ పంట పండినట్టే.
Also Read: సర్కారు బడి నుంచి సూపర్ స్కూల్ దాకా… తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గేమ్ ఛేంజర్! – Crime Mirror