Homeఆంధ్ర ప్రదేశ్ఎంపీ VS ఎమ్మెల్యే...!

ఎంపీ VS ఎమ్మెల్యే…!

  • ఎచ్చెర్ల సీటుపై ఇద్దరు నేతల కన్ను

  • మెగా బ్రదర్ నాగబాబు సైతం..

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో కీలక నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఒకటి. ఇక్కడ నుంచి కావలి ప్రతిభా భారతి, కిమిడి కళా వెంకట్రావు లాంటి వారు ప్రాతినిధ్యం వహించారు. మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ నుంచి బిజెపి అభ్యర్థి నడికుదుటి ఈశ్వరరావు గెలిచారు పొత్తులో భాగంగా. అయితే ఈ సారి ఈ సీటు టిడిపి తీసుకుంటుందన్న ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే కొత్త అభ్యర్థి రంగంలోకి దిగడం ఖాయం.

  • హేమహేమీలు ప్రాతినిధ్యం..

1983 నుంచి 1999 వరకు వరుసగా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి గెలిచారు ప్రతిభా భారతి. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంగా ఉన్న ఎచ్చర్లలో ఆమె అప్రతిహసంగా విజయం సాధిస్తూ వచ్చారు. అయితే 2004లో మాత్రం ఆమె ఓడిపోయారు. 2009 నుంచి ఎస్సీ కాస్త బీసీ జనరల్ గా మారింది.

Also Read: టాలీవుడ్‌లో మళ్లీ మురారి బ్యూటీ సందడి…! – Crime Mirror

2009లో మీసాల నీలకంఠం నాయుడు, 2014లో కిమిడి కళా వెంకట్రావు, 2019లో గొర్ల కిరణ్ గెలిచారు ఈ నియోజకవర్గం నుంచి. 2024 లో మాత్రం పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించారు. ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన ఈశ్వరరావు విజయం సాధించారు.

  • నాగబాబు సైతం దృష్టి..

వచ్చే ఎన్నికల్లో ఈ సీటు టిడిపికి కేటాయిస్తారన్న ప్రచారం నడుస్తోంది. మరోవైపు జనసేన సైతం కర్చీఫ్ వేసిందన్న టాక్ ఉంది. మెగా బ్రదర్ నాగబాబు ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ప్రచారం ఉంది. మరోవైపు తెలుగుదేశం ఈ సీటు తీసుకుంటే పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రయత్నంలో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

మొన్నటి ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం సీటు కేటాయించారు. కానీ వివిధ సమీకరణలో భాగంగా ఆయనకు ఎంపీగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు. అనూహ్యంగా బిజెపికి ఈ సీటు కేటాయించారు. అయితే 2019 ఎన్నికల వరకు టిడిపిలో ఉండి.. ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత బిజెపిలో చేరారు ఈశ్వరరావు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరరావుకు బిజెపి హై కమాండ్ సీటు ఇచ్చింది.

Also Read: విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్.. ప్రతిష్ఠాత్మక ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ!! – Crime Mirror

అప్పట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి ఈ సీటు కేటాయించారు ఈశ్వరరావుకు. ఈసారి మాత్రం కలిశెట్టి అప్పలనాయుడు సీటు ఆశిస్తున్నారు. కానీ నడికుదుటి ఈశ్వరరావుకు మంత్రి నారా లోకేష్ తో మంచి సంబంధాలు ఉన్నాయి.

అవసరం అనుకుంటే ఈశ్వరరావు టిడిపిలోకి వచ్చేందుకు సిద్ధమే అన్న ప్రచారం నడుస్తోంది. మొత్తానికి అయితే ఎన్నికలు ఇంకా మూడు సంవత్సరాలు ఉండగా.. ఎమ్మెల్యే టికెట్ కోసం ఇప్పటి నుంచే పోటీ ప్రారంభం కావడం విశేషం.

Also Read: ఇంట్లో వైఫై స్లోగా ఉందా…? అయితే ఇలా చెయ్యండి…! – Crime Mirror

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు