Homeవైరల్పెద్ది ఐటెం సాంగ్‌పై ట్రోల్స్.. అనంత శ్రీరామ్ ఘాటు రిప్లై...!

పెద్ది ఐటెం సాంగ్‌పై ట్రోల్స్.. అనంత శ్రీరామ్ ఘాటు రిప్లై…!

Crime Mirror,Cinema Updates: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. విడుదలైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.378 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి 2026లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అయితే సినిమా విజయంతో పాటు ఇందులోని ఒక ఐటెం సాంగ్‌పై సోషల్ మీడియాలో చర్చ కూడా కొనసాగుతోంది.

ఈ చిత్రంలోని అన్ని పాటలను ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ రచించారు. ఆల్బమ్‌లోని పాటలు మంచి ఆదరణ పొందుతున్నప్పటికీ, ఒక ప్రత్యేక గీతంలోని కొన్ని పదాలు, సాహిత్యంపై కొందరు నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన పెద్ది సక్సెస్ మీట్‌లో అనంత శ్రీరామ్ ఈ విమర్శలపై స్పందించారు.

Also Read: చల్లగా ఉంటాయని తాగుతున్నారా..? మీ ఆరోగ్యానికి ప్రమాదమే…!

తనదైన శైలిలో మాట్లాడిన ఆయన, ఐటెం సాంగ్‌ను ఐటెం సాంగ్‌లా ఆస్వాదించిన వాళ్లకు మేము ఒక ప్రత్యేకమైన అనుభూతి ఇచ్చాం. కానీ దాన్ని ఆ కోణంలో చూడకుండా విమర్శించే వాళ్లే అసలు ఐటమ్ గాళ్లు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించడమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అనంత శ్రీరామ్ మాట్లాడుతూ విమర్శలు చేయడం తప్పు కాదని, అయితే అవి తార్కికంగా ఉండాలని అన్నారు. నా పాటలో ఏ పదం తప్పు, ఏ వాక్యం సమాజానికి హానికరం అనే విషయాన్ని స్పష్టంగా చెబితే దానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉంటాను. కానీ వ్యక్తిగత దూషణలు, ఎజెండాలతో చేసే విమర్శలకు స్పందించాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు.

Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం: మిస్సోరీలో స్కైడైవింగ్ ప్లేన్ కుప్పకూలి 12 మంది మృతి

సోషల్ మీడియాలో తనపై వచ్చిన వ్యక్తిగత కామెంట్ల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. కొందరు అసభ్య పదజాలంతో విమర్శించినప్పటికీ వాటిని తాను సీరియస్‌గా తీసుకోలేదన్నారు. ఆ తిట్లకు సమాధానం నా పాటల్లోనే ఉంది అంటూ తనే రాసిన ఓ గీతంలోని పంక్తులను ఉదహరించి స్పందించారు.

రచయితగా తన ఆలోచనలను పంచుకుంటూ, రచనకు అవధులు ఉండకూడదు. పాట ఏ తరహాలో ఉన్నా, ఆ సందర్భానికి తగ్గ భావాన్ని ప్రేక్షకులకు చేరవేయడమే రచయిత బాధ్యత అని అన్నారు. మొత్తానికి పెద్ది ఐటెం సాంగ్‌పై వచ్చిన వివాదానికి అనంత శ్రీరామ్ తనదైన స్టైల్‌లో గట్టిగానే సమాధానం ఇచ్చారు.

Also Read: బుచ్చిబాబుతో మెగాస్టార్ రెడీ.. కానీ ఒక్క కండీషన్…!

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు