Homeక్రైమ్తిరుమల ఘాట్ రోడ్డులో విషాదం.. ప్రమాదంలో భక్తుడు మృతి

తిరుమల ఘాట్ రోడ్డులో విషాదం.. ప్రమాదంలో భక్తుడు మృతి

క్రైమ్ మిర్రర్ : దైవ దర్శనం కోసం తిరుమలకు వచ్చిన ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనం అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ భక్తుడు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని బన్నేరుఘట్ట రోడ్ ప్రాంతానికి చెందిన సాయి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి కారులో తిరుమలకు వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం శుక్రవారం తిరుగు ప్రయాణమయ్యారు.

మొదటి ఘాట్ రోడ్డులోని 22వ మలుపు వద్దకు చేరుకున్న సమయంలో కారు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం కారు సుమారు 15 అడుగుల లోతులో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాల కారణంగా సతీష్ కుమార్ (72) చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగతా కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, మృతదేహాన్ని స్వస్థలానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
also read : ఇద్దరు గిరిజన బాలికలపై అఘాయిత్యం.. ముగ్గురు అరెస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు