Homeతెలంగాణబిజెపి దూకుడు...!

బిజెపి దూకుడు…!

  • ఖైరతాబాద్ అభ్యర్థి ఎంపికలో తలమునకలు

  • ముందుగానే ఖరారు చేసి ప్రచార పర్వంలోకి

  • ఇద్దరు ఆశావహుల మధ్య విపరీతమైన పోటీ

 

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:తెలంగాణలో బిజెపి దూకుడు పెంచింది. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. సరైన అభ్యర్థుల కోసం వడబోస్తోంది. ఈ క్రమంలో ప్రముఖంగా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బొల్లంపల్లి ఇంద్రసేనారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఖైరతాబాద్ స్థానాన్ని అధికార కాంగ్రెస్, ప్రధాన విపక్షం బిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో బిజెపి సైతం ముందుగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అభ్యర్థిని దింపి ప్రచారం మొదలు పెట్టాలని భావిస్తోంది.

నాలుగు సార్లు పోటీ…

Also Read:బహుజనుల అవకాశాలను ఆక్రమించిన సామాజిక ప్రతినిధిగా కేసీఆర్…

చింతల రామచంద్రారెడ్డి గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో పోటీ చేశారు. 2009, 2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో నాలుగు సార్లు పోటీ చేశారు. 2014లో మాత్రమే గెలిచారు. మిగిలిన మూడు ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అయితే ఈసారి ఆయనకు ఛాన్స్ ఇస్తారా? లేదా? అనేది చూడాలి. మరోవైపు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న బొల్లంపల్లి ఇంద్రసేనారెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నారు. గత కొంతకాలంగా ఆయన బిజెపికి విశేష సేవలు అందిస్తున్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఆయన గత కొంతకాలంగా స్టార్టప్ లు ఏర్పాటు చేయాలనుకునే వారికి సలహాలు, సూచనలు అందిస్తున్నారు. దేశ ఆర్థిక అభివృద్ధితోనే వికసిప్ భారత్ లక్ష్యాన్ని సాధించవచ్చని ఆలోచనతో ముందుకు వెళుతున్నారు.

సీనియర్ మోస్ట్ లీడర్…

Also Read:రేవంత్ చేతిలో బ్రహ్మాస్త్రాలు…!

చింతల రామచంద్రారెడ్డి అత్యంత సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన వయసు ప్రస్తుతం 74 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో ఆయనకు మరోసారి టికెట్ దక్కుతుందా అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. కానీ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిగా ఆయనకు పేరు ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని కమలనాదులు భావిస్తున్నారు. అందుకే ఖైరతాబాద్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. ముందుగానే అభ్యర్థిని ఎంపిక చేసి ప్రచారంలో దింపితే ఫలితం ఉంటుందన్న ఆలోచనతో ఉన్నారు. కాంగ్రెస్ తో పాటు బిఆర్ఎస్ తిరువల్లే ఈ ఎన్నికలు వచ్చాయని చెబుతూ బిజెపి ప్రజల్లోకి వెళ్లేందుకు బలమైన ప్రయత్నంలో ఉంది. మరి ఇందులో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు