క్రైమ్ మిర్రర్ : జార్ఖండ్‌లో పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల నిరసన కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. రాంచీలో జార్ఖండ్ అసెంబ్లీ వైపు ర్యాలీగా వెళ్తున్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బోరాపై ఓ వ్యక్తి సిరా చల్లాడు. విద్యార్థులతో కలిసి నిరసనలో పాల్గొంటున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. దాడికి పాల్పడిన వ్యక్తి నేహా బోరాపై ఆరోపణలు చేస్తూ నినాదాలు చేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనపై నేహా బోరా స్పందిస్తూ, ఇలాంటి దాడులకు తాను భయపడబోనని తెలిపారు. విద్యార్థుల సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తనపై దాడి చేసిన వ్యక్తిపై ఆమె ఆరోపణలు చేశారు. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షలకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపట్టినట్లు ఆమె తెలిపారు. విద్యార్థుల ఉద్యమాలను అణచివేయడానికి ఇలాంటి చర్యలు ఉపయోగపడవని నేహా బోరా పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
also read : తిరుమల ఘాట్ రోడ్డులో విషాదం.. ప్రమాదంలో భక్తుడు మృతి
