Homeఆంధ్ర ప్రదేశ్అలెర్ట్!.. 3 రోజులు పాటు పిడుగులతో కూడిన వర్షాలు

అలెర్ట్!.. 3 రోజులు పాటు పిడుగులతో కూడిన వర్షాలు

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు దంచి కొట్టనున్నాయి అని తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ కీలక నివేదిక వెల్లడించింది. ఇవాళ, రేపు మరియు ఎల్లుండి పిడుగులతో కూడినటువంటి వర్షాలు జిల్లాలలో కురుస్తాయి అని తెలిపింది.

ఈరోజు వర్షాలు కురిసే జిల్లాలు :-
మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, గుంటూరు, ఎన్టీఆర్, శ్రీ సత్య సాయి, కడప మరియు అన్నమయ్య.

రేపు వర్షాలు కురిసే జిల్లాలు :- విజయనగరం, మన్యం, అల్లూరి, సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు దంచికొట్టనున్నాయి.

కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మూడు రోజులపాటు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వ్యవసాయం చేసేటువంటి రైతన్నలు కూడా ఈ వర్షాలు పట్ల జాగ్రత్తలు వహించాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు