Homeఆంధ్ర ప్రదేశ్కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం, ముగ్గురు మృతి...!

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం, ముగ్గురు మృతి…!

కర్నూలు, క్రైమ్ మిర్ర‌ర్‌:  ఆదోని మండలం పాండవగల్లు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పాండవగల్లు నుంచి గనేకల్ గ్రామానికి బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులను, ఆదోని నుంచి కౌతాళం వెళ్తున్న ఆటో ఎదురుగా వచ్చి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, ఆటోలో ప్రయాణిస్తున్న మరోవ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తాజావార్తలు