Homeతెలంగాణపెద్ది డబ్బింగ్ లో చాలా కష్టపడ్డా...జగపతిబాబు..

పెద్ది డబ్బింగ్ లో చాలా కష్టపడ్డా…జగపతిబాబు..

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: పెద్ది’ సినిమాలో తన పాత్ర అప్పల సూరి గురించి జగపతి బాబు మాట్లాడుతూ… ”ఈ ‘పెద్ది’ సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు అవుతుందని నేను నమ్ముతున్నా. ఇందులో నా పాత్ర సినిమాకు ఎమోషనల్ పిల్లర్ లాంటిది. ఇది నెగిటివ్ పాత్ర కాదు… ఈ పాత్ర కోసం నటనలో కంటే నేను పడ్డ కష్టం అంతా డబ్బింగ్లో ఉంది. ఆ ఉత్తరాంధ్ర యాస, పాత్రలోని ఎమోషన్ రావడం కోసం రోజుకు కేవలం రెండు మూడు డైలాగులు మాత్రమే చెప్పేవాడిని. ఆ క్రమంలో కొన్నిసార్లు నా నరాలు కూడా బిగుసుకుపోయాయి” అని చెప్పారు.

‘కష్టాల్లో ఉన్నవారికి లేదా యువతకు మీరు ఇచ్చే సలహా ఏమిటి?’ అని జగపతి బాబును అడిగితే… ”నేను ఎవరికీ సలహాలు ఇవ్వను. కానీ నా లైఫ్ మంత్ర మాత్రం ఒక్కటే… లెట్ ఇట్ గో అండ్ సో వాట్ . ఏది జరిగినా మన మంచికే అనుకుని ప్రవాహంతో పాటు సాగిపోవాలి. జీవితాన్ని సింపుల్గా ఉంచుకుంటే అన్నీ సింపుల్గా అవుతాయి” అని అన్నారు. తాను డెస్టినీని. జ్యోతిష్యాన్ని బలంగా నమ్ముతానని జగపతి బాబు చెప్పారు. వైదీశ్వరన్ కోయిల్ లో తన నాడి చూసి తన జీవితంలో జరిగే విషయాలన్నీ ముందే చెప్పారని, అవి అలాగే జరుగుతున్నాయి కూడా జగపతి బాబు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు