Homeక్రైమ్హైదరాబాద్‌లోని దోమలగూడ ప్రాంతంలో ముగ్గురు బాలికలు అదృశ్యం.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

హైదరాబాద్‌లోని దోమలగూడ ప్రాంతంలో ముగ్గురు బాలికలు అదృశ్యం.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

హైదరాబాద్ నగరంలో ముగ్గురు బాలికలు కనిపించకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. దోమలగూడ ప్రాంతానికి చెందిన స్నేహ, లలిత, లత అనే చిన్నారులు ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ బాలికలు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వలస కుటుంబాల పిల్లలు. ఇంటి నుంచి వెళ్లిన అనంతరం హిమాయత్‌నగర్ ప్రాంతంలో ఒక ఆటోలో ఎక్కినట్లు గుర్తించారు. ఆ తరువాత కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద దిగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదైనట్లు తెలుస్తోంది.

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. బాలికల ఆచూకీ కోసం నగరంలోని కీలక ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. రైల్వే స్టేషన్ పరిసరాలు, బస్ స్టేషన్లు, పబ్లిక్ ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
ఈ ఘటనపై పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. బాలికల గురించి ఏ సమాచారం ఉన్నా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరుతున్నారు.

also read: బాలున్ని తరగతి గదిలో ఉంచి తాళం వేసిన టీచర్… నిర్లక్ష్యానికి సస్పెన్షన్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు