Homeక్రైమ్ఇదో కొత్త త‌ర‌హా సైబ‌ర్ నేరం...బ్యాంక్ అధికారుల‌మంటూ 77ల‌క్షల టోక‌రా...!

ఇదో కొత్త త‌ర‌హా సైబ‌ర్ నేరం…బ్యాంక్ అధికారుల‌మంటూ 77ల‌క్షల టోక‌రా…!

హైదరాబాద్, క్రైమ్‌మిర్ర‌ర్‌: సైబరాబాద్ లో సరికొత్త తరహ సైబర్ నేరం బయటపడింది. ఈ సిమ్ ను ఫిజికల్ సిమ్ గా మార్చాలనీ బ్యాంక్ అధికారుల పేరుతో బాధితుడికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసారు. ఈ సిమ్ ను చేంజ్ చేసి జనరల్ సిమ్ గా మార్చి తాము పంపిన ఫోన్ లో వేయండి అని నమ్మించారు. మోటోరాల ఫోన్ ను బాధితుడికి పంపి ముందుగానే కొన్ని యాప్ లను పెట్టారు. తరువాత బాధితుడి ఖాతాలో ఉన్న 77 లక్షలు రూపాయలు కాజేసారు సైబర్ నేరగాళ్లు.

సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ మాట్లాడుతూ వెస్ట్ బెంగాల్ లో ఒక చెట్టు కింద కూర్చుని ఈ తరహా సైబర్ నేరానికి సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్నారు. అచ్చం జాంతార తరహాలో నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ నేరంలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసారు. 15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నెల రోజుల పాటు వెస్ట్ బెంగాల్, ఢిల్లీ లో ఆపరేషన్ నిర్వహించినట్లు డీసీపీ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు