Homeఆంధ్ర ప్రదేశ్రాష్ట్రవ్యాప్తంగా రహదారులు శుభ్రంగా ఉంచేలా ప్రత్యేక డ్రైవ్...! సీఎం చంద్రబాబు నాయుడు

రాష్ట్రవ్యాప్తంగా రహదారులు శుభ్రంగా ఉంచేలా ప్రత్యేక డ్రైవ్…! సీఎం చంద్రబాబు నాయుడు

శ్రీకాకుళం, క్రైమ్‌మిర్ర‌ర్‌: నరసన్నపేటలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హజరయ్యారు. చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం పరిశుభ్రంగా ఉండాలనే స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమం చేపట్టాం. ఇది నా మనసుకు చాలా దగ్గరగా ఉండే కార్యక్రమం ఇది. ఇవాల్టి నుంచి స్వచ్ఛపథం కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా రహదారులు శుభ్రంగా ఉంచేలా ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామని అన్నారు.

అలాగే ప్రతీ నెలా మొదటి తేదీన అర్హులు, అవసరమైన వ్యక్తులకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అత్యంత శ్రద్ధగా చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం లబ్దిదారులకు సరిగ్గా అందుతుందా లేదా అనేది చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నాం. పాపులేషన్ మేనేజ్మెంట్ ద్వారా దేశానికి జనాబాను సంపదగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మూడు-నాలుగో సంతానానికి ప్రోత్సాహకం ఇచ్చేలా నిర్ణయం కూడా తీసుకుంటున్నామని అన్నారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే ప్రక్రియ ద్వారా భూముల రికార్డులను ప్రక్షాళన చేసే కార్యక్రమం కూడా చేపడుతున్నాం. వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో ఎక్కడా భూ తగాదాలు లేకుండా చేసే బాధ్యత కూటమి ప్రజా ప్రభుత్వానిది. అధికారంలోకి వచ్చాక 17వ సారి స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నాను. కేవలం మన పరిసరాలు, ఇల్లు, కార్యాలయాలే కాదు అన్ని ప్రాంతాలూ పరిశుభ్రంగా ఉండేలా మన అలవాట్లూ మారాలి. సమాజంలో మార్పు వస్తేనే స్వఛ్చాంధ్ర లక్ష్యం సాధ్యం అవుతుంది. 2047 స్వర్ణాంధ్ర విజన్ రూపోందించుకున్నాం.

2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఏపీని తీర్చిదిద్దటంతో పాటు రూ.54 లక్షల తలసరి ఆదాయం తీసుకురావటం మా ప్రభుత్వ లక్ష్యం. సమాజంలో ఆర్ధిక అసమానతలు తగ్గించి అందరి జీవన ప్రమాణాలు పెంచటమే ఆలోచనగా పనిచేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధికి కూడా నిధులు కావాలి. సంపద సృష్టిస్తేనే సంక్షేమం చేయగలం. పేదవాళ్లకు చేయూతను ఇచ్చేలా పీ4 కార్యక్రమం చేపట్టామని అన్నారు.
మార్గదర్శి బంగారు కుటుంబాలుగా వ్యవహరించి పేదరికాన్ని రూపుమాపేలా ప్రయత్నం చేస్తున్నాం.

సమాజంలో సంపద కలిగిన 10 శాతం మంది దిగువన ఉన్న 20 శాతం మందిని ఆదుకునేలా పీ4 కార్యక్రమం చేపట్టాం. 2047 నాటికి ప్రపంచంలోనే అగ్రస్థాయి దేశంగా భారత్ మారుతుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఈ లక్ష్యం సాధిస్తాం. గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. 2019-24 మధ్య అరాచకం సృష్టించారు. నరకాసురుడు అనే రాక్షసుడిని చంపిన రోజును దీపావళిగా మనం జరుపుకుంటున్నాం. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు అది. గత పాలకులు చేసిన చెడును మర్చిపోలేం. 86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను గత పాలకులు వదిలేసి వెళ్లారు. దానిని తొలగించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాం.

చెత్త నుంచి విద్యుత్ తయారు చేసేలా ప్లాంట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నాం. ప్రతీ ప్రాంతంలో వస్తున్న చెత్త కాంపోస్టుగా, సర్క్యులర్ ఎకానమీ లేదా విద్యుత్ తయారీ ప్లాంట్లకు తరలించేలా ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా చెత్తను వేరు చేయడానికి సెగ్రిగేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేసాం తద్వారా డంపింగ్ యార్డులకు స్వస్తి పలుకుతున్నాం. నెట్ జీరో క్యాంపస్లుగా రాష్ట్రంలోని హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లను తయారు చేస్తున్నాం. వ్యర్ధాలు లేకుండా వాటిని స్వచ్ఛమైన క్యాంపస్ లు గా రూపోందిస్తున్నాం.

ప్రతీ ప్రభుత్వ కార్యాలయం పైనా సోలార్ రూఫ్ టాప్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించాం. ముస్తాబు కార్యక్రమం ద్వారా విద్యార్ధులలోనూ పరిశుభ్రతను, ఆత్మవిశ్వాసాన్ని నేర్పేలా అమలు చేస్తున్నాం. స్వచ్ఛ రధాల ద్వారా ఘన వ్యర్ధాలు, ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను సేకరిస్తున్నాం. రాష్ట్రంలోని ప్రాంతాలను 33 శాతం పచ్చదనం వచ్చేలా లక్ష్యాలను నిర్దేశించామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు