Homeఆంధ్ర ప్రదేశ్వైసీపీ పాలనలో అడవి పందుల్లా రాష్ట్రాన్ని నాశనం చేశారు: సీఎం చంద్రబాబు

వైసీపీ పాలనలో అడవి పందుల్లా రాష్ట్రాన్ని నాశనం చేశారు: సీఎం చంద్రబాబు

క్రైమ్ మిర్రర్,అమరావతి:- గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసీపీ పాలనలో నాయకుల తీరు అడవి పందుల్లా పంటను నాశనం చేసినట్లుగా ఉందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “2024-26 రెండేళ్లకు రావాల్సిన నిధులను కూడా 2024 కంటే ముందే, అంటే వారి పాలనలోనే వాడేశారు. భవిష్యత్తు అవసరాలకు ఉండాల్సిన డబ్బును కూడా వదల్లేదు. మా ఊర్లో అడవి పందులు ఉంటాయి.. అవి పంట తింటే పర్లేదు కానీ, పంటనంతా తొక్కి నాశనం చేస్తాయి. వైసీపీ నేతలు కూడా అలాగే రాష్ట్రాన్ని అంతలా నాశనం చేశారు” అని మండిపడ్డారు.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేశారని, అభివృద్ధిని వెనక్కి నెట్టారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోకుండా ఇష్టానుసారంగా నిధులను దుర్వినియోగం చేశారని విమర్శించారు. శ్వేతపత్రం ద్వారా గత ప్రభుత్వ ఆర్థిక అరాచకాలను ప్రజల ముందు ఉంచామని, రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు.

పెనమలూరు వంతెన వద్ద విషాదం.. మృతదేహం వెలికితీసేందుకు వెళ్లిన యువకుడు గల్లంతు

హైదరాబాద్‌లో కల్తీ మసాలాల గుట్టురట్టు… 25 టన్నులు స్వాధీనం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు