క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- అమెరికాలో మరోసారి తెలంగాణకు చెందిన యువకుడు దారుణంగా హత్యకు గురవడం కలకలం రేపుతోంది. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కుంచ అన్షుల్ న్యూయార్క్‌లో ఉన్నత చదువులు అభ్యసిస్తూ జీవనం సాగించేందుకు పిజ్జా డెలివరీ బాయ్‌గా పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే జీవనోపాధి కోసం చేస్తున్న ఆ పని అతని ప్రాణాలను బలి తీసుకోవడం విషాదకరం.
స్థానిక సమాచారం ప్రకారం, రాత్రి సమయంలో డెలివరీ కోసం వెళ్లిన అన్షుల్‌పై గుర్తుతెలియని దుండగులు కాల్పులకు దిగారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అన్షుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.ఈ ఘటనతో అన్షుల్ కుటుంబంలో విషాదం అలుముకుంది. కుమారుడి మృతవార్త విన్న తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ముఖ్యంగా తన అన్నను కోల్పోయిన సోదరి అన్వి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు గ్రామస్తులను కంటతడి పెట్టిస్తోంది. కుటుంబ సభ్యులు అన్షుల్ మృతదేహాన్ని త్వరగా భారత్‌కు తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.అధికారుల సమాచారం ప్రకారం, సోమవారం నాటికి అన్షుల్ మృతదేహం భారత్‌కు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో అన్షుల్ ఇంటికి చేరుకొని కుటుంబాన్ని ఓదారుస్తున్నారు.
విదేశీ చదువులపై పెరుగుతున్న ఆందోళనలు
ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా వంటి దేశాలకు వెళ్తున్నారు. అంచనాల ప్రకారం ఏటా 50-60 వేల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తుండగా, అందులో సగం మంది తెలుగు రాష్ట్రాల నుంచే ఉండటం గమనార్హం.
అయితే ఇటీవలి కాలంలో భారతీయులపై, ముఖ్యంగా తెలుగు విద్యార్థులపై జరుగుతున్న దాడులు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. విదేశీ చదువులు ఇప్పుడు కేవలం అవకాశమే కాకుండా ప్రమాదకరంగా మారుతున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఉత్తరాది రాష్ట్రాల్లో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు.. తాజా నివేదికలో వెల్లడి
తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్.. ఏపీలోకి ప్రవేశించిన రుతుపవనాలు!