Homeరాజకీయంఅన్నామలై, రజనీకాంత్ కాంబో!

అన్నామలై, రజనీకాంత్ కాంబో!

•తమిళనాడులో సరికొత్త ఆధ్యాత్మిక రాజకీయ పార్టీ
•చెన్నై వేదికగా విస్తృత చర్చలు
•త్వరలో సరికొత్త పార్టీ
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్:-
తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పార్టీలపై ప్రచారం జోరుగా సాగుతోంది. ఎందుకంటే తమిళ ప్రజలు కొత్తదనాన్ని స్వాగతిస్తున్నారు. అందుకే బిజెపికి అన్నమలై ఇలాంటి నేత గుడ్ బై చెప్పారు. తమిళవాదంతో సొంత అజెండాతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే తమిళనాడు పొలిటికల్ సర్కిల్లో మరో వార్త విపరీతంగా ప్రచారం అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, అన్నామలై చుట్టూ ఒక ఆసక్తికర వార్త షేక్ చేస్తోంది. ఇద్దరూ కలిసి కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనేది ఈ వార్త సారాంశం. బిజెపిలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఉన్న అన్నామలై.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత ఓ కొత్త రాజకీయ వేదికను ప్రకటించారు. రాజకీయ పార్టీని కూడా ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయన ప్రారంభించిన వేదికకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది.

ద్రవిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా..
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి అన్నమలై సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించబోతున్నారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ లో ప్రారంభం అయింది. ద్రవిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ఒకసారి కొత్త శకం ప్రారంభం కాబోతుందని చర్చ జోరందుకుంది. అన్నామలై మొదటి నుంచి రజినీకాంత్ ను తన వ్యక్తిగత గురువుగా, ఆధ్యాత్మిక మార్గదర్శక భావిస్తూ వచ్చారు. ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత 2020లో రజనీకాంత్ స్వయంగా అన్నామలైని తన ఇంటికి ఆహ్వానించారు. అప్పటినుంచి వీరి మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి. ఎప్పటికప్పుడు రజనీకాంత్ ను కలిసే అన్నామలై ఆయన నుంచి సలహాలు స్వీకరిస్తూ వచ్చారు.

అన్నామలై ని ముందు పెట్టి..
ప్రస్తుతం అన్నామలై బిజెపికి గుడ్ బై చెప్పిన తరుణంలో.. రజనీకాంత్ తో ఉన్న అనుబంధంతో.. ఆధ్యాత్మిక రాజకీయం సిద్ధాంతంతో .. అన్నా మలైని ముందు పెట్టి తెరవెనుక నుంచి రజనీకాంత్ మద్దతు తెలుపుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో రజనీకాంత్ సొంత పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి.. ఆరోగ్యం సహకరించక వెనక్కి తగ్గారు. ప్రస్తుతం తమిళనాడులో టీవీ కే హవాను నియంత్రించే శక్తి అన్నమలైకు ఉందని రజనీకాంత్ నమ్ముతున్నట్లు తెలుస్తోంది. అన్నామలై లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న యువనేతకు రజనీకాంత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తోడైతే రాష్ట్రంలో తిరుగులేని పొలిటికల్ ఊపు వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

చెన్నై వేదికగా చర్చలు..
బిజెపికి గుడ్ బై చెప్పిన అన్నామలై రజినీకాంత్ ఆశీస్సులు తీసుకున్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది పొలిటికల్ వర్గాల్లో. రజనీకాంత్ అభిమాన సంఘాలు చాలా క్రియాశీలకంగా పనిచేస్తాయి. ప్రస్తుతం అన్నామలైతో రజనీకాంత్ అభిమాన సంఘాలు విస్తృత చర్చలు జరుపుతున్నట్లు చెన్నై వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే తమిళనాడు రాజకీయాల్లో ఇది పెద్ద చారిత్రాత్మక మలుపు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కాకముందే.. వచ్చే ఎన్నికలు టార్గెట్ చేసుకొని రాజకీయాలు నడుస్తుండడం విశేషం.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు