-
నవంబర్లో అమిత్ షా.. డిసెంబర్లో ప్రధాని నరేంద్ర మోడీ
-
అగ్ర నేతల వరుస పర్యటనలు
-
అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : ఎట్టకేలకు తెలంగాణపై బిజెపి పూర్తిగా ఫోకస్ పెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా దూకుడు పెంచుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్లు.. సార్వత్రిక ఎన్నికలకు మరో మూడేళ్లు ఉండడంతో దూకుడు పెంచాలని నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు లక్ష్యంగా బిజెపి అగ్రనాయకత్వం సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా నవంబర్ లో, ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబరులో తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేపట్టేందుకు షెడ్యూల్ ఖరారు అయింది. ఢిల్లీ పెద్దలు ఏకకాలంలో వరుస పర్యటనలతో రాష్ట్రంలో అడుగుపెడుతుండడం కాషాయ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతోంది. ఏదైనా రాష్ట్రంపై బీజేపీ టార్గెట్ పెట్టుకుంటే అగ్ర నేతలు ఆ రాష్ట్రాన్ని చుట్టుముడతారు. ఇప్పుడు బెంగాల్ తర్వాత తెలంగాణ పై ఫుల్ ఫోకస్ పెట్టారు కమలనాధులు.
బూత్ స్థాయి టార్గెట్…
అమిత్ షా ఏ రాష్ట్రంపై దృష్టి పెడితే అక్కడ బూత్ స్థాయి కార్యకర్తలని టార్గెట్ చేసుకుంటారు. ఇప్పుడు తెలంగాణ పర్యటనలు ఆయన చేసేది అదే. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పరిధిలోని బూత్ కమిటీ సమ్మేళనాల్లో నేరుగా పాల్గొనున్నారు. బిజెపి సిద్ధాంతంలో బూత్ స్థాయి బలమే ఎన్నికల విజయాలకు అసలైన పునాది. కేవలం భారీ బహిరంగ సభలకే పరిమితం కాకుండా.. నేరుగా పోలింగ్ బూత్ కార్యకర్తలతో అమిత్ షా భేటీ కానున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 8 ఎంపీ స్థానాలను గెలుచుకుంది బిజెపి. అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా నిలిచింది. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓటు బ్యాంకును మరింత పటిష్టం చేసుకుంటూ.. గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ పూర్తిస్థాయిలో యాక్టివేట్ చేసేందుకు ఈ సమ్మేళనాలను వేదికగా ఎంచుకుంది.
అనుకూలంగా మలుచుకోవాలని…
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీపై ఉన్న అసంతృప్తిని.. ప్రతిపక్ష బీఆర్ఎస్ లో సంక్షోభాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకోవడమే బిజెపి ప్రధమ లక్ష్యం. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలు, రుణమాఫీ, గ్యారెంటీ ల వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకతను ఒడిసిపట్టేందుకు ఢిల్లీ నాయకత్వం నేరుగా కార్యాచరణను రూపొందిస్తుంది. డిసెంబర్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ద్వారా కేంద్ర నిధులు, అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలతోపాటు డబ్బులు ఇంజిన్ సర్కార్ నినాదాన్ని.. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి భావోద్వేగపూరిత వాతావరణాన్ని సృష్టించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
చేరికలకు ప్రోత్సాహం…
ఏదైనా రాష్ట్రంపై బిజెపి కన్నేస్తే అక్కడ పూర్తి రాజకీయ కార్యకలాపాలను ఆ పార్టీ మొదలు పెడుతుంది. ఇక్కడ విజయం దక్కిన తర్వాతనే మరో రాష్ట్రంపై దృష్టి పెడుతుంది. అయితే బిజెపి ఫుల్ ఫోకస్ పెట్టిన తరుణంలో ఇప్పుడు ఆ పార్టీలో చేరికల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రెండేళ్ల తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి ఇప్పటినుంచి పునాదిరాళ్లు వేస్తున్నట్లు భావిస్తున్నారు. నామమాత్రపు విమర్శలతో సరిపెట్టకుండా.. ఢిల్లీ అగ్రద్వైయం నేరుగా రంగంలోకి దిగి బూత్ స్థాయి సైనికులకు దిశా నిర్దేశం చేయడం ద్వారా.. తమ అసలైన గేమ్ ప్లాన్ కు శ్రీకారం చుట్టింది. ఎన్నికల నాటికి ఎలాంటి పొత్తులు, ఆందోళనలు లేకుండా స్వసక్తితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే అంతిమ లక్ష్యంగా కమలదళం పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తోంది.
ఇవి కూడ చదవండి:
-
నెల్లూరులో జెన్ జి యువత పోటీ…!
-
ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం…! నామినేషన్ల గడువు పెంపు
-
జడ్పీ లపై జనసేన పట్టు..! ఆరు జిల్లా పరిషత్ పీఠాలపై కన్ను…
-
ప్రభాస్ బర్త్డే స్పెషల్.. ‘ఫౌజీ’ నుంచి సరికొత్త పోస్టర్ విడుదల.. ఆ వీడియోపై పెరిగిన ఆసక్తి!
