Homeతెలంగాణమంత్రివర్గంలో భారీ మార్పులు!

మంత్రివర్గంలో భారీ మార్పులు!

•కీలక నేతల శాఖలు గల్లంతు
•తెలంగాణ క్యాబినెట్ విస్తరణలో సంచలనాలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :-
తెలంగాణ క్యాబినెట్ లో మార్పు జరగనుందా? పునర్వ్యవస్థీకరణలో శాఖల మార్పు అనివార్యమా? కొందరు నేతలకు పదోన్నతి ఖాయమా? తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే చర్చ. పనితీరు సరిగా లేని మంత్రులను పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రాధాన్యత ఉన్న శాఖల నుంచి తప్పించనున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ హై కమాండ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు సీనియర్ల చేతిలో ఉన్న కీలక శాఖలను మార్చే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

హై కమాండ్ గ్రీన్ సిగ్నల్..
మంత్రివర్గ విస్తరణ పై గత కొంతకాలంగా ప్రచారం నడుస్తూ వచ్చింది. ఎట్టకేలకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రానున్న పది రోజుల్లో మంత్రివర్గ విస్తరణ కాయం అని సమాచారం. ప్రస్తుతం క్యాబినెట్లో రెండు పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడమే కాదు ఒకరిద్దరి మంత్రులను తొలగిస్తారు అన్న ప్రచారం కూడా ఉంది. మరోవైపు మంత్రుల శాఖల మార్పుపై కూడా హైకమాండ్ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ ప్రచారం నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్నం, పరిగి ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలను కలిశారు. మంత్రులుగా తమ పేర్లను పరిశీలించాలని కోరారు. శనివారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా రాహుల్ గాంధీని కలిసి మంత్రివర్గంలో తనకు చోటు కల్పించాలని కోరారు.

తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్.. ఏపీలోకి ప్రవేశించిన రుతుపవనాలు!

పెద్ద పెద్ద మార్పులు..
క్యాబినెట్ లో ఉన్న కీలక నేతల శాఖల మార్పు అనివార్యం అని తెలుస్తోంది. ప్రధానంగా మల్లు భట్టి విక్రమార్క వద్ద ఉన్న ఆర్థిక శాఖను తప్పిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన వద్ద ఆర్థిక శాఖతో పాటు విద్యుత్ శాఖ వంటి కీలక శాఖలు ఉన్నాయి. అందుకే ఆర్థిక శాఖను తప్పించి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు కేటాయిస్తారని ప్రచారం ఉంది. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని రెవెన్యూ శాఖ నుంచి తప్పిస్తారని కూడా తెలుస్తోంది. ఆ శాఖను మరొకరికి కేటాయించి అవకాశం ఉందని సమాచారం. భట్టి, పొంగులేటిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలోనే వారి శాఖల మారుస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. మరోవైపు క్యాబినెట్లోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని తీసుకుంటే.. ఆయన సోదరుడు వెంకటరెడ్డిని తప్పించే అవకాశం ఉంది. ఒకవేళ వెంకట్రెడ్డిని సైతం కొనసాగించాలి అనుకుంటే ఆయన వద్ద ఉన్న కీలక శాఖలను తప్పిస్తారు. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రోడ్లు భవనాలతో పాటు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. ఆయన వద్ద నుంచి రోడ్లు భవనాలు సేకరించి అవకాశం ఉంది. మరోవైపు రవాణా తో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ శాఖలను కూడా మారుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. స్పీకర్ గా ఉన్న గడ్డం ప్రసాద్ ను మంత్రిగా ఎంపిక చేసి.. మంత్రిగా ఉన్న లక్ష్మణ్ ను స్పీకర్ చేస్తారని తెలుస్తోంది. ఇలా మార్పులు చేర్పులతో తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఉండనున్నట్లు సమాచారం.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు