క్రైమ్ మిర్రర్, సినిమా:- తమిళ సూపర్‌స్టార్, తమిళనాడు సీఎం విజయ్ తనకు లక్కీ చార్మ్ మరియు ఫేవరెట్ స్టార్ అని ప్రముఖ కథానాయకి సమంత కొనియాడారు. ఆయనతో కలిసి తాను నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయని, ఒక టాక్ షోలో పాల్గొన్న సందర్భంగా సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.సినిమా కెరీర్ ముగింపు దిశలో లేనప్పుడు, కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో విజయ్ రాజకీయాల్లోకి వెళ్లడం సులువైన నిర్ణయం ఏమీ కాదని సమంత అభిప్రాయపడ్డారు. కష్టపడే మనస్తత్వానికి, పట్టుదలకు విజయ్ ఒక గొప్ప నిదర్శనం అంటూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు.
కాగా, విజయ్ – సమంత కాంబినేషన్లో వచ్చిన ‘కత్తి’, ‘పోలీసోడు’, ‘అదిరింది’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి ప్రేక్షకులను విశేషంగా అలరించిన సంగతి తెలిసిందే. విజయ్ రాజకీయ పయనంపై సమంత వ్యక్తంచేసిన ఈ అభిప్రాయాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
వనాటు దీవుల్లో భారీ భూకంపం…! రిక్టర్ స్కేలుపై 7 .2 తీవ్రతగా నమోదు…
