HomeతెలంగాణBreaking: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడో తెలుసా..?

Breaking: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడో తెలుసా..?

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణలో 117 మున్సిపాలిటీలు మరియు 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2026 ప్రారంభంలో తెలంగాణ రాష్ట్రాల్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి “ఇద్దరు పిల్లల నిబంధనను” (Two-child norm) రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది అని తెలుస్తుంది.

 

బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. ఈసారి ఎన్నికలను ఈవీఎంలకు (EVM) బదులుగా బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

 

ముఖ్యమైన తేదీలు:
జనవరి 1, 2026న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది.
జనవరి 10, 2026: ఓటర్ల తుది జాబితా ప్రచురణ.
జనవరి 11 లేదా 20: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
ఫిబ్రవరి 2026: ఈ నెలలోనే పోలింగ్ నిర్వహించి ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికలు మే 2026లో జరిగే అవకాశం ఉంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు