Homeతెలంగాణమీనాక్షి పై కుట్ర వెనుక ఆ ఎమ్మెల్యే!.. వ్యక్తిగత సహాయకుడు సైతం!!

మీనాక్షి పై కుట్ర వెనుక ఆ ఎమ్మెల్యే!.. వ్యక్తిగత సహాయకుడు సైతం!!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : మీనాక్షి నటరాజన్ పై కుట్ర చేసింది ఓ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నా? ఆ ఎమ్మెల్యే మొదటిసారి గెలిచారా? ఆయన వ్యక్తిగత కార్యదర్శి మీనాక్షి నటరాజన్ పై ఉన్న పాత కక్షతో సమాచారాన్ని బిజెపికి అందించారా? హైదరాబాద్ నాంపల్లి కోర్టులో ఆమెపై ఉన్న ఒక ప్రైవేటు పిటిషన్ అంతర్గత సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ నిఘా వర్గాలు దీనిని గుర్తించినట్లు ప్రచారం నడుస్తోంది.

నామినేషన్ తిరస్కరణ..

మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నటరాజన్ కు రాజ్యసభ అవకాశము కల్పించారు ఆగ్రనేత రాహుల్ గాంధీ. గాంధీ కుటుంబం పట్ల వీర విధేయతతో ఉండే మీనాక్షి నటరాజన్ కు అవకాశం ఇచ్చారు. అయితే ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఓ కేసుకు సంబంధించి తన ఆఫిడవిట్లో పేర్కొనలేదని బిజెపి నుంచి అభ్యంతరాలు రావడంతో నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ఎమ్మెల్యే తో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు బిజెపికి సహకరించినట్లు ఇప్పుడు తేలడం ఆందోళన కలిగిస్తోంది.

జరిగింది ఇది..

నారాయణపేట కాంగ్రెస్ నేత కుంభం శివకుమార్ రెడ్డి తనపై లైంగిక వేధింపులకు, బెదిరింపులకు పాల్పడ్డారంటూ హైదరాబాద్ తార్నాకకు చెందిన ఒక మాజీ మహిళా కార్పొరేటర్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజకీయ ఒత్తిడితో పోలీసులు కేసును సరిగ్గా దర్యాప్తు చేయలేదని ఆరోపిస్తూ ఆమె నాంపల్లి కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ఇన్చార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ కు తాను పలుమార్లు ఫిర్యాదు చేసినా ఆమె చర్యలు తీసుకోలేదని.. నిందితుడిని పార్టీ అధికారిక వేదికలపై ప్రోత్సహిస్తున్నారని పేర్కొంటూ మీనాక్షి నటరాజన్ ను రెస్పాండెంట్ గా చేర్చారు. కానీ ఈ సమాచారాన్ని తెలుసుకున్న రాజ్యసభ బిజెపి అభ్యర్థి మహేష్ కేవత్.. ఆ కేసు వివరాలను ప్రస్తావిస్తూ.. మీనాక్షి నటరాజన్ ఆ వివరాలను దాచారంటూ రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేయడంతో ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది.

రాహుల్ సీరియస్..

తెలంగాణ నుంచి కొత్తగా గెలిచిన ఓ ఎమ్మెల్యే తో పాటు వ్యక్తిగత సహాయకుడికి ఇందులో పాత్ర ఉందని హై కమాండ్ భావిస్తోంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ మధ్యప్రదేశ్లో సైతం ప్రకంపనలు సృష్టించింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీక్షలు చేపడుతున్నారు. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు సైతం అధిష్టానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్పై గట్టిగానే ఆగ్రహంగా ఉన్నారు. పదవులతో సంబంధం లేకుండా తెలంగాణ కాంగ్రెస్ కోర్ టీం మొత్తానికి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ లో భారీ మార్పులు, చేర్పులు ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు