మర్రిగూడ(క్రైమ్ మిర్రర్) : మర్రిగూడ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) పాఠశాలలో ఖాళీగా ఉన్న మూడు, సహాయ వంట మనుషుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు, మండల విద్యాధికారి (ఎంఈవో) శారద గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వంట చేయుటలో అనుభవం కలిగిన, మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులని ఆమె పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులను 2026 జూన్ 19వ తేదీ నుండి 2026 జూన్ 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు, కేజీబీవీ మర్రిగూడ పాఠశాలలో సమర్పించాలని సూచించారు. గడువు తేదీ తర్వాత వచ్చే దరఖాస్తులను స్వీకరించబోమని ఎంఈవో శారద స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు పాఠశాల ఎస్.వోను సంప్రదించగలర ఆమె తెలిపారు..